• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

BREAKING: మీడియాపై మోహన్ బాబు దాడి

TG: జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీడియాపై నటుడు మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులపై మైక్ తీసుకోని దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే మోహన్ బాబుతో మనోజ్ వాగ్వాదానికి దిగాడు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్ సీజ్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

December 10, 2024 / 07:49 PM IST

కేంద్రమంత్రులకు పెమ్మసాని చంద్రశేఖర్‌ లేఖ

AP: కేంద్ర మంత్రులకు పెమ్మసాని చంద్రశేఖర్ లేఖ రాశారు. గుంటూరు జిల్లా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. స్పైసెస్ బోర్డు ఆఫ్ ఇండియాలో మిర్చి విభాగం ఏర్పాటు, కనీస మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్‌లను పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.

December 10, 2024 / 07:44 PM IST

నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర నియోజకవర్గానికి నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎంపీ డీకే అరుణకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి దేవరకద్రలో విలేకరులతో మాట్లాడుతూ.. దేవరకద్రలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని ఈ దిశగా ఎంపీ ఆలోచించి దేవరకద్రకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని కోరారు.

December 10, 2024 / 07:42 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్

కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

December 10, 2024 / 07:39 PM IST

బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం

KNR: హుస్నాబాద్‌లో ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆవిష్కరించారు. హుస్నాబాద్ పట్టణంలోని కాలనీనకుండా ఆయన పర్యటించారు. ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

December 10, 2024 / 07:38 PM IST

BREAKING: మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

TG: జల్‌పల్లిలోని ఫామ్‌హౌస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మంచు మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే మనోజ్‌ను గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో గేట్లు తోసుకొని మనోజ్ లోపలికి వెళ్లాడు.

December 10, 2024 / 07:37 PM IST

రెవెన్యూ సదస్సులలో 38 అర్జీలు

ప్రకాశం: పంగులూరు మండలంలోని మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 38 అర్జీలు వచ్చినట్లు పంగులూరు మండల తహసీల్దార్ సింగారావు తెలిపారు. ముప్పవరం 23, జాగర్లమూడి వారి పాలెం 15 ఇలా మొత్తం 38 అర్జీలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై ఆరా తీశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

December 10, 2024 / 07:37 PM IST

స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: BRS నేతలు

TG: ఎమ్మెల్యేల ఓరియంటేషన్ సెషన్‌ను బీఆర్ఎస్ నేతలు బహిష్కరించారు. తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని ఆరోపించారు. తెలంగాణ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బీఆర్ఎస్ నేతలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

December 10, 2024 / 07:37 PM IST

వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: భీమడోలు మండలం గుండుగొలను వద్ద గోదావరి కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులను మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. ఈ మేరకు కాలువలో పేరుకుని ఉన్న గుర్రపుడెక్కను వెంటనే తొలగించి రైతులకు దాళ్వా పంటకు సాగునీటికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూడాలని, ఇరిగేషన్ అధికారులుతో మాట్లాడారు. వంతెన పనులు గురించి స్థానిక కూటమి నాయకులతో చర్చించారు.

December 10, 2024 / 07:36 PM IST

‘నిరుపయోగంగా ఉన్న భవనాన్ని ప్రెస్ క్లబ్‌కు ఇవ్వండి’

KNR: ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో గల ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భవనాన్ని 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. దానిని ప్రెస్ క్లబ్‌కు కేటాయించాలని మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారికి గుండోజు సత్తయ్యకు ఎల్లారెడ్డిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ బృందం ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

December 10, 2024 / 07:35 PM IST

బుచ్చి పట్టణంలో జనసైనికులు సంబరాలు

NLR: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్ర బాబుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో బుచ్చి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి నాగేంద్ర బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీని కష్టకాలంలో అండగా నిలిచారని ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కడం హర్షనీయమన్నారు.

December 10, 2024 / 07:35 PM IST

‘ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక సర్వేలో ఇబ్బందులు లేకుండా చూడాలి’

BDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పంపిణి కొరకు నిర్వహించాల్సిన సర్వేలో కొన్ని సవరణలు చేసినట్లయితే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు చేరుతాయని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు రామారావు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కు తెలియజేశారు. ఈ సమస్యపైన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

December 10, 2024 / 07:32 PM IST

25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

TG: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనం జప్తు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 10, 2024 / 07:30 PM IST

ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు: కలెక్టర్

GDWL: ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ -2 పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు మంగళవారం సూచించారు. 2 పరీక్షలు 2 రోజులపాటు 4 దఫాలుగా నిర్వహిస్తామన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలన్నారు.

December 10, 2024 / 07:30 PM IST

రేపు కలెక్టర్ల సదస్సుకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

KRNL: వెలగపూడిలోని సచివాలయంలో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు CM చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌‌కు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పీ.రంజిత్ బాషా, జీ.రాజకుమారి హాజరుకానున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తదితర అంశాలపై CM దిశా నిర్దేశం చేయనున్నారు.

December 10, 2024 / 07:29 PM IST