TPT: ఎర్రావారిపాళెం మండలం ఉదయ మాణిక్యం గ్రామంలో రేపు చంద్రగిరి ఎమ్మెల్యే నాని పర్యటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే రెవిన్యూ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. రైతుల సమస్యలు, భూ సమస్యలు పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల రైతులు, భూ సమస్యలు ఉన్నవారు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపింది.
MDK: మెదక్ పట్టణంలోని పిల్లి కోటలో వైద్య మెడికల్ కాలేజ్ క్యాంటీన్ హాస్టల్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
MDK: మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12లోపు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో తెలియజేయాలన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ రాజకీయ పార్టీలకు తెలిపారు.
నంద్యాల: ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాడుగులపల్లి ఎస్సై ఎస్. కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులు ఇరువర్గాలు రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. ఇతర విషయాల గురించి ఏమైనా సందేహం ఉంటే మండల స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
MDK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11వ ప్రపంచ వ్యవసాయ గణనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రణాళిక అధికారి మాకం బద్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ గణన రెండు దశల్లో ఉంటుందన్నారు. రెండవ దశలో 98 గ్రామాల్లో 64 మంది విస్తరణ అధికారులు పాల్గొంటారన్నారు. ఈ వివరాలను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు.
NLG: సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశ కార్యకర్తలను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి, ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18 వేలను అందించాలన్నారు.
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ 30 రోజుల్లో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెగా మాస్ మేనియా వచ్చేస్తుంది. థియేటర్స్‌లో కలుద్దాం అనే క్యాప్షన్ జత చేశారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
W.G: లేస్‌కు మరింత వన్నె తెచ్చేదిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు కలెక్టర్‌ను న్యూఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.విశ్వ ఆధ్వర్యంలో కలుసుకుని లేస్ ఉత్పత్తులపై చర్చించారు.
VSP: విశాఖలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణిని మంగళవారం జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గిరిజన ప్రాంత సమస్యలను మంత్రి దృష్టికి తీసువచ్చారు. గిరిజన గురుకులల్లో ఔట్‌సోర్స్‌లో పనిచేస్తున్న తమను సీఆర్టీలుగా మార్చండంటూ గత 4 వారాలుగా నిరవధిక దీక్ష చేస్తున్న వారి సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు.
HYD: ఈనెల 14న నార్సింగి పరిధి కోకాపేట్ వద్ద దొడ్డి కొమురయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను డా.బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
VZM: నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి గ్రామంలో మంగళవారం వేకువజామున పురిళ్లు దగ్ధమైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాడుగుల గురువులు అనే వృద్ధుడు ఒంటరిగా పురి పాకలో నివాసం ఉంటున్నాడు. వేకువజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న గురువులు తేరుకొని తప్పించుకొని బయటకి వచ్చాడు.
VZM: విజయనగరం మండలంలోని 22 గ్రామ పంచాయితీలకు చెందిన జనసైనికులు మంగళవారం రామనారాయణం సమీపంలోని తోటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా నెల్లిమర్ల శాసన సభ్యులు లోకం నాగమాధవి, జనసేన నాయకులు లోకం ప్రసాద్, అవనాపు విక్రమ్, భావన దంపతులు హాజరై దిశానిర్ధేశం చేశారు. ప్రతీ పల్లె, ప్రతీ గ్రామంలో జనసేన జెండా ఎగరాలన్నారు.
NLG: ఎంజీ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి హాజరై మాట్లాడుతూ.. జాతీయ సేవా పథకం వాలంటీర్స్ హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి, వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.
BHPL: మహాదేవపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మేసినేని రవీందర్ రావు, కోరిపల్లి కిషన్ రావుకు చెందిన ఆవు కరెంట్ షాక్‌తో మృతి చెందాయి. మండలంలోని డబల్ బెడ్రూమ్ కాలనీలో ఉన్న 33 కెవిలైన్ ట్రాన్స్‌ఫార్మర్ వైయర్లు తగిలి కరెంట్ షాక్‌తో మృతి చెందుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆవు విలువ రూ.1,50,000 ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
SKLM: నీటి సంఘాల ఎన్నికలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించి మైనర్ నీటి సంఘాల రైతులతో సాగు నీటి సంఘాలు ఎన్నికలు, నోటిఫికేషన్ నిర్వహణ,పై సమీపించారు. గత ప్రభుత్వం చాకు నీటి సరఫరా వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.