TG: జల్పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఘటనపై మోహన్‌బాబు స్పందించారు. ‘మనోజ్ నువ్వు నా బిడ్డవు. నిన్ను ఎలా పెంచానురా నేను.. అందరికంటే నిన్నే గారాభంగా పెంచాను. నువ్వు ఏది అడిగినా నీకిచ్చాను. కానీ నువ్వు ఈరోజు చేస్తున్న పని.. బిడ్డలు గుండెల మీద తంతారంటారే.. అలా తన్నావురా. నా మనసు ఆవేదనతో కృంగిపోతుంది. నేను మీ అమ్మ ఏడుస్తున్నామ్. మీ అమ్మ ఎంతో కుమిలిపోతుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.