• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కార్పొరేషన్ ఎన్నికలపై BRS కీలక నిర్ణయం

TG: కార్పొరేషన్ ఎన్నికల కోసం BRS అధిష్టానం నేతలకు బాధ్యతలు అప్పగించింది. పార్టీ కార్యక్రమాలు, నేతలకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం కోసం బాధ్యతలు ఇచ్చింది. దాసోజు శ్రావణ్, కర్నె ప్రభాకర్‌ GHMC బాధ్యతలు చేపట్టనున్నారు. MLC శంభీపూర్ రాజుకు మల్కాజ్‌గిరి కార్పొరేషన్ బాధ్యతలు, MLC పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించింది.

February 28, 2026 / 08:29 PM IST

విద్యార్థుల ప్రతిభకు వేదికగా సైన్స్ ఫేర్

KRNL: ఆదోనిలోని సరస్వతి శశి మందిర్ స్కూల్లో ఇవాళ నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. టీడీపీ యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

February 28, 2026 / 08:29 PM IST

ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థినిలకు అవగాహన

HNK: ఆత్మకూరు మండలం తిరుమలగిరి సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులకు సూచనలు చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు.

February 28, 2026 / 08:28 PM IST

నాయనపల్లి మైసమ్మ జాతరపై పోలీసులు అలర్ట్

NGKL: జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి జాతర సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదివారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ పోలీసులు మోహరించారు.

February 28, 2026 / 08:28 PM IST

తొర్రూరులో ఘనంగా C.V రామన్ జయంతి వేడుకలు

MHBD: తొర్రూర్ పట్టణ కేంద్రంలోని వికాస్ కళాశాలలో మేర యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సి.వి. రామన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోఆర్డినేటర్ నవిన్ యాదవ్ మాట్లాడుతూ.. సి.వి. రామన్ ఆవిష్కరణలతోనే ప్రపంచం ముందుకు సాగుతోందని, యువత కూడా కొత్త ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కావాలని, నిరంతరం ఆవిష్కరణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

February 28, 2026 / 08:27 PM IST

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం: మంత్రి

NDL: ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే పురపాలక పాఠశాలను ఆయన శనివారం పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. TDP హయాంలో పాఠశాలలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

February 28, 2026 / 08:27 PM IST

‘ఆత్మగౌరవం దెబ్బతీసేలా విద్య కమిషన్ రిపోర్ట్’

ADB: తెలంగాణ విద్యావిధానం-2026 నివేదికలో విద్య కమిషన్ తమ పరిధి దాటి ఉపాధ్యాయుల వేతనాలు, ప్రమోషన్లు, నియామకాల గురించి మాట్లాడడం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని PRTU తెలంగాణ సంఘం జిల్లాధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ నాయక్ అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయులను గౌరవించాలని పేర్కొన్నారు.

February 28, 2026 / 08:26 PM IST

‘విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలి’

JGL: విద్యార్థులు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి అన్నారు. పట్టణంలోని కేరళ హై స్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు పలు అంశాలపై చెపట్టిన ప్రాజెక్టులను ఎస్సై సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్సై మట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.

February 28, 2026 / 08:26 PM IST

HYDలో కీలక నిర్ణయం.. ఇక ప్రతి ఆదివారం..!

HYD: గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

February 28, 2026 / 08:24 PM IST

మిగిలిన 5% పనులు త్వరలో పూర్తి చేయాలి: మంత్రి

MLG: మేడారం మహా జాతర విజయవంతానికి అందరూ పట్టుదలతో కృషి చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ సాయంత్రం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో 251 కోట్లతో చేపట్టిన పనుల్లో 95% పూర్తయ్యాయని, మిగిలిన 5% పనులను త్వరలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

February 28, 2026 / 08:24 PM IST

RTI నూతన క్యాలండర్లను ఆవిష్కరించిన.. మాజీ మంత్రి

MHBD: జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో హ్యూమన్ రైట్స్ కోసం నిరంతరం సేవలు అందిస్తున్న సంస్థ, టీం సభ్యులు, బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేస్తున్న వారి సేవలు మరవలేనివని అన్నారు.

February 28, 2026 / 08:24 PM IST

నన్నయ వర్సిటీలో నేషనల్ సైన్స్ డే

E.G: నన్నయ యూనివర్సిటీలో శనివారం నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, ప్రిన్సిపల్ డా. పి.విజయనిర్మల, తదితరులు వేడుకలు ప్రారంభించారు. వికసిత భారత నిర్మాణంలో మహిళల పాత్రపై జరిగిన వర్క్‌షాప్‌లో వారు ప్రసంగించారు. సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు.

February 28, 2026 / 08:23 PM IST

సాధికారత ఉపాధి కల్పన పథకాల అమలుపై సమీక్ష

ఏలూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి శనివారం ఉంగుటూరు శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి మహిళ సాధికారత ఉపాధి కల్పన పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 08:22 PM IST

ఇన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు

JN: సాగరం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గాద ఇన్నయ్య తండ్రి సాల్మన్ రెడ్డి మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, సుదర్శన్ రెడ్డి, రమేష్, తదితరులు ఉన్నారు.

February 28, 2026 / 08:21 PM IST

షాది ఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పెమ్మసాని

GNTR: పెదకాకాని మండలం నంబూరులో శనివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ షాది ఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ వలివేటి మురళీకృష్ణ, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:21 PM IST