VSP: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మార్చి 3న శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో డోలోత్సవం, వసంతోత్సవం, గ్రామ తిరువీధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం స్వామివారు కొండదిగువ పుష్కరిణి ఉద్యానవన మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది.