TG: ఆశా వర్కర్ల ద్వారా ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహా ఆరోపించారు. ఆశా వర్కర్ల ధర్నాపై ఆయన స్పందించారు. ప్రభుత్వం నిర్వహించే విజయోత్సవాలను ప్రతిపక్షం తట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆశావర్కర్లకు జీతాలు పెంచలేదని తెలిపారు. బీఆర్ఎస్ మాయలో పడి రోడ్లపైకి రావద్దని ఆశా వర్కర్లకు సూచించారు.