ప్రకాశం: ప్రమాదకర పరిశ్రమలల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలులోని కల్లెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో పరిశ్రమ నిర్వాహకులు, అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదకర ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయరు చేయాలని సూచించారు.