కోనసీమ: అమలాపురంలోని ఈదరపల్లి కొత్త వంతెన నిర్మాణం కారణంగా రాకపోకలు సాగించేందుకు రూట్లు మారాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అమలాపురం బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులు గడియార స్తంభం కాలేజీ రోడ్డు, పేరూరు వై జంక్షన్ మీదుగా 216 జాతీయ రహదారికి వెళ్లనున్నాయి. వయా బోడస్కురు, అంబాజీ పేట, రావులపాలెనాకి దారిని మళ్లించారు.