GNTR: నకిలీ విద్యా ధృవపత్రాలతో న్యాయవాదులుగా నమోదైన జిల్లాకు చెందిన ఇద్దరిని రాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి తొలగిస్తూ కార్యదర్శి పద్మలత ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్రోల్మెంట్ కమిటీ నివేదిక ఆధారంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. హైకోర్టు సహా పలు ప్రాంతాల్లో వృత్తి నిర్వహిస్తున్న ఈ ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.