VZM: మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని 1వ పట్టణ ఎస్సై నరేష్ సూచించారు. పట్టణంలోని ఓ స్టడీ సర్కిల్లో యువతకు మంగళవారం అవగాహన కల్పించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేశామని వాటి ద్వారా తమకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.