ప్రకాశం: ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చంద్రశేఖరపురం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సయ్యద్ అనీఫ్ మాట్లాడుతూ.. మండలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలతోపాటు, ఇల్లు నిర్మించాలని తహసీల్దార్ వాసుదేవరావుకు వినతిపత్రం అందజేశారు.