• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాంసం ధరల వివరాలు..!

అన్నమయ్య: రాయచోటిలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు వెల్లడయ్యాయి. చికెన్ కేజీ రూ. 230, స్కిన్‌లెస్ చికెన్ రూ. 260గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 950గా స్థిరంగా కొనసాగుతోంది. చేపలలో కొరమేను రూ. 450, రాగండి రూ. 200, బొచ్చెలు రూ. 230గా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా చికెన్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.

March 1, 2026 / 12:14 PM IST

పెరుగుతున్న ఎండల తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు ఉష్ణోగ్రతలలో భారీ పెరుగుదల కనిపిస్తుందని తెలిపింది. పగటి పూట ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని సూచించింది.

March 1, 2026 / 12:13 PM IST

వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరికలు..!

NDL: కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నిమ్మకాయల రంగయ్య తన అనుచరులతో కలిసి ఇవాళ బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీ నాయకులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.

March 1, 2026 / 12:13 PM IST

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకులు

KMM: ఖమ్మం వెలుగుమట్ల పేద ప్రజల ఇండ్లను కూల్చడమేనా ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా పాలన అని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంలో నిరసన తెలిపారు. అలాగే ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాయ కష్టం చేసి లక్షలాది రూపాయలు అప్పు చేసి పేద ప్రజలు భూములు కొని ఇళ్లు నిర్మించుకుంటే దయాదాక్షణ్యం లేకుండా ఈ ప్రభుత్వం కూలగొడుతుందా అనే ప్రశ్నించారు.

March 1, 2026 / 12:11 PM IST

మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

RR: శంకర్‌పల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, రవీందర్, రవి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాస్కర్ రెడ్డి అన్నారు.

March 1, 2026 / 12:11 PM IST

నిబంధనలను మరింత కఠినతరం చేస్తాం: వాసంశెట్టి

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనాస్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. ‘ఈ ఘటనతో నిబంధనలను మరింత కఠినతరం చేస్తాం. ప్రతీ మూడు నెలలకోసారి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశిస్తాం. ఆర్డర్ టార్గెట్ రీచ్ కావాలని యాజమాన్యం నిబంధనలు పక్కన పెట్టింది. బాధిత కుటుంబాలను ఆదుకునే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే’ అని పేర్కొన్నారు.

March 1, 2026 / 12:07 PM IST

విశాఖలో PGRS ఫిర్యాదులపై ప్రశ్నలు

విశాఖపట్నంలో ప్రతి సోమవారం కలెక్టరేట్, జీవీఎంసీ మెయిన్ కార్యాలయం, జోన్ కార్యాలయాల్లో PGRS నిర్వహిస్తున్నారు. అయినా ఫిర్యాదులు ఎక్కువగా జోన్ కార్యాలయాలకంటే జీవీఎంసీ మెయిన్ ఆఫీస్, కలెక్టరేట్‌కే చేరుతున్నాయి. జోనల్ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదా? లేక వాటి వివరాలు ప్రజలకు తెలియవా? అనే అంశంపై చర్చ జరుగుతుంది.

March 1, 2026 / 12:07 PM IST

చేర్యాలలో సిండికేట్ మాయాజాలం!

SDPT: చేర్యాల మండల కేంద్రంలో మద్యం సిండికేట్ ఆగడాలు మితిమీరుతున్నాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో విక్రయించే మద్యం సీసాలపై సిండికేట్ స్టిక్కర్లు దర్శనమిస్తుండటం కలకలం రేపుతోంది. అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నా, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

March 1, 2026 / 12:07 PM IST

‘రహదారుల నిర్మాణం కొరకు నిధులు మంజూరు’

VZM: విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు చొరవతో ఆదివారం మండలం పరిధిలో గల 7 రహదారుల నిర్మాణం (15.068 కి.మీ.) కొరకు రూ.7.67 కోట్లు నిధులు మంజూరు అయినట్లు మండల పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలో ప్రజల తరపున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

March 1, 2026 / 12:07 PM IST

TMCE&WU రాష్ట్ర కార్యదర్శిగా తోట రామాంజనేయులు

KMM: తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (TMCE&WU) రాష్ట్ర కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి తోట రామాంజనేయులును వరంగల్‌లో రాష్ట్ర నాలుగో మహాసభలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామాంజనేయులు మాట్లాడుతూ.. తనను ఎన్నుకున్న నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

March 1, 2026 / 12:06 PM IST

సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ పనులు

SRPT: మునగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారి 65పై నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా లైట్లు వెలగకపోవడంతో వాహనదారులు, రోడ్డు దాటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్థులు అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు సిబ్బందిని పంపి మరమ్మతులు చేపట్టారు.

March 1, 2026 / 12:05 PM IST

యుద్ధం ఎవరికీ ఏమీ మిగల్చదు!

పూర్వకాలపు దాడులకు, నేటి క్షిపణి దాడులకు తేడా ఏముంది? అప్పుడు కత్తులు, ఇప్పుడు బాంబులు. ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం అమాయక పసిపిల్లలు, వృద్ధులే. అభివృద్ధి చెందిన దేశాల స్వార్థం వల్ల మానవత్వం మంటగలుస్తోంది. ఆయుధాల దాడిలో సామాన్యుల ఆర్తనాదాలు అరణ్య రోదనలుగా మారుతున్నాయి. మానవత్వం గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఈ ఆధునిక కాలంలో, ఇలాంటి హింసాకాండ నాగరిక సమాజానికి తీరని మచ్చ.

March 1, 2026 / 12:05 PM IST

చికెన్ ధరల వివరాలు..!

కడప: జిల్లాలో రంజాన్ మాసం సందర్భంగా చికెన్ ధరలు పెరిగాయి. గత వారం రూ. 220గా ఉన్న కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ. 250కు చేరింది. స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ. 270గా విక్రయిస్తున్నారు. డిమాండ్ అధికమవడంతో దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపిస్తోంది. రంజాన్ కాలంలో వినియోగం పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.

March 1, 2026 / 12:03 PM IST

సికింద్రాబాద్ నుంచి హోలీ కోసం ప్రత్యేక రైళ్లు

HYD: హోలీ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రైళ్లలో ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి నహరిగన్ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఉన్నాయని Rail One యాప్ ద్వారా చూసుకునే వెసులుబాటు కల్పించినట్లుగా పేర్కొన్నారు.

March 1, 2026 / 12:02 PM IST

కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్‌వో

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

March 1, 2026 / 12:02 PM IST