SKLM: వసతి గృహాలు పరిశుభ్రత, పౌష్టిక ఆహారం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయశాఖ సంస్థ, కార్యదర్శి, ఆర్.సన్యాసి నాయుడు అన్నారు. మంగళవారం రణస్థలంలో గల గవర్నమెంట్ కళాశాల నందు బిసి హాస్టల్‌ను సందర్శించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు ఆహార సదుపాయాలు గురించి ఆరా తీస్తూ తగు సూచనలు ఇస్తూ పిల్లల పట్ల శ్రద్ధ చూపాలని తెలిపారు.
GNTR: తమకు మంచినీటిని అందజేయాలని ప్రత్తిపాడు జగనన్న కాలనీ వాసులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాలనీకి గత వారం రోజులు నుండి మంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఖాళీ బిందెలు చూపిస్తూ నిరసన తెలిపారు. ఈ సమస్యపై గతంలో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కోరారు.
AP: సిద్దిపేట కోమటిచెరువు ప్రాంతంలో తిరుపతి వెంకటేశుడు కొలువుదీరనున్నాడు. తిరుపతి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో టీటీడీ వెంకన్న ఆలయం ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే టీటీడీ పాలకమండలి సమావేశంలో దీనిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
HYD: స్కూల్ గ్రౌండ్‌లో మంగళవారం సీఎం కప్ ఆటల పోటీలను నాగారం మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ప్రారంభించారు. మెరుగైన జీవితానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు. వైస్ ఛైర్మన్ మల్లేశ్ యాదవ్,మున్సిపల్ కమిషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్,ఎం.వెంకట్ రెడ్డి,పంగ హరిబాబు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
కృష్ణా: సీసీ కెమెరాలతో నేరస్తులను పట్టుకోవచ్చని కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ పేర్కొన్నారు. మండవల్లిలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మంగళవారం గ్రామ పెద్దలు, వ్యాపారులతో సీఐ సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. 500 మంది ప్రజలకు ఒక పోలీసు ఉంటే కంట్రోలు చేయగలరని, మన వ్యవస్థలో 5 వేల మందికి ఒక పోలీసు లేరని పేర్కొన్నారు.
NRML: ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 8080 మంది అభ్యర్థి పరీక్షకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సమావేశంలో అధికారులతో వారు మాట్లాడుతూ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
SRCL: పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను మంగళవారం తనిఖీ చేసినట్టు జిల్లా డిప్యూటీ ఉప వైద్యాధికారి అంజలి తెలిపారు. పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి రికార్డు స్కానింగ్ మిషన్లను పర్యవేక్షించినట్టు ఆమె పేర్కొన్నారు. గర్భస్థ పూర్వపిండ స్కానింగ్ పరీక్షలు, రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆధ్వర్యంలో నిబంధనలను అనుసరించి చేయాలని ఆదేశించారు.
W.G: పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక విద్యుత్ స్తంభం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. నరసాపురం నిడదవోలు రోడ్డులో నిత్యం వాహనాలు తిరిగే ప్రదేశంలో ఇలా ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభం ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
WGL: వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఆవరణలో ఉన్న ఈవీఎం కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఈవీఎంలను పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డిఓ రాథోడ్ రమేష్, కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మంచు ఫ్యామిలీలో గొడవలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పందించాడు. మొహన్ బాబు ముక్కుసూటి మనిషని, ఇండస్ట్రీలో అతను ఓ టైగర్ అని పేర్కొన్నాడు. మంచు కుటుంబానికి చాలా మంచి పేరు ఉందన్నారు. అలాంటి ఫ్యామిలీలో గొడవలు జరగడం దురదృష్టకరమన్నారు. వారికి ఏదో నగఘోష తగిలినట్లుందని, మోహన్ బాబు తప్ప వారి వివాదాన్ని ఎవరూ పరిష్కరించలేరన్నారు.
SDPT: ఈనెల 14న జరుగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ కోరారు. రాజీమార్గమే రాజమార్గమని, సమయాన్ని డబ్బులను ఆదాచేసుకోవాలన్నారు. కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు.
ELR: ఏలూరు పార్లమెంటు పరిధిలో రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దిల్లీ రైల్ భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశం సందర్భంగా ఎంపీ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
HYD: స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కోసం పెత్తందారీ వ్యవస్థపై రాజీలేని పోరాటం చేసిన పండుగ సాయన్న పోరాట పటిమ భావితరాలకు ఆదర్శమని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ కార్యదర్శి దోమ మోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం తలకొండపల్లిలో పండుగ సాయన్న వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
HYD: అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన నివాసంలో సతీసమేతంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాలేరు వెంకటేశ్ శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని దీవించారని ఎమ్మెల్యే తెలిపారు.
HYD: రేపటి నుంచి రెండు రోజుల పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. MHRD లోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఈ శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల విధివిధానాలను, సభ జరిగే తీరు, సభా మర్యాద, ప్రత్యేకత గురించి వివరించే అవకాశం ఉంది.