• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే విరాళం

ప్రకాశం: కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కనిగిరి అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శుక్రవారం శీలవారిపల్లి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌లో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తమ వంతు సహాయ సహకారాలు కావాలని కోరారు. దీంతో ఆయన అంబేద్కర్ విగ్రహానికి రూ. 1,01,116 రూపాయలు అందజేస్తానని వెల్లడించారు.

February 20, 2026 / 07:05 PM IST

మంత్రి లోకేష్‌ను పేర్ని నాని కౌంటర్

AP: మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘పుష్ప సినిమా డైలాగ్‌లు Xలో పెట్టటం కాదు.. మీ మ్యాచ్ టికెట్‌లకు డబ్బులు ఎక్కడివో పోస్ట్ చేయండి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్ని స్పెషల్ ఫ్లైట్ టికెట్‌లు మీ డబ్బులతో కొన్నారో చెప్పండి. లోకేష్ ఎవరి డబ్బులతో ఫ్లైట్ బుక్ చేసి శ్రీలంక వెళ్లారు?’ అని నిలదీశారు.

February 20, 2026 / 07:04 PM IST

మంత్రి లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్

AP: మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘పుష్ప సినిమా డైలాగ్‌లు Xలో పెట్టటం కాదు.. మీ మ్యాచ్ టికెట్‌లకు డబ్బులు ఎక్కడివో పోస్ట్ చేయండి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్ని స్పెషల్ ఫ్లైట్ టికెట్‌లు మీ డబ్బులతో కొన్నారో చెప్పండి. లోకేష్ ఎవరి డబ్బులతో ఫ్లైట్ బుక్ చేసి శ్రీలంక వెళ్లారు?’ అని నిలదీశారు.

February 20, 2026 / 07:04 PM IST

2వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా: సీపీఎం

KDP: ఖాజీపేట మండలంలో సుమారు 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామీణ ల్యాండ్ మాఫియా కబ్జా చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ ఆరోపించారు. శుక్రవారం జరిగిన ‘భూ సదస్సు’లో ఆయన మాట్లాడుతూ.. 10 గ్రామాల్లో కబ్జాలకు గురైన ఈ భూములను అధికారులు వెంటనే కాపాడాలని, కబ్జాదారులకు రాజకీయ పార్టీల అండ ఉందని విమర్శించారు.

February 20, 2026 / 07:04 PM IST

మహిళా సమాఖ్య సమావేశం

BDK: చుంచుపల్లి మండల కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. విద్యాచందన హాజరై రుణాల 100% రిపేమెంట్, PMKSY పనుల పూర్తి, యూనిఫామ్‌ల తయారీని సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతపై గ్రామస్థాయి బాధ్యత వహించాలని సూచించారు.

February 20, 2026 / 07:03 PM IST

రాయితీ యంత్రాల పేరిట రూ. కోటికి పైగా టోకరా

KMM: చింతకాని మండలంలో 50% రాయితీపై ట్రాక్టర్లు, రోటవేటర్లు ఇస్తామని నమ్మించి ఓ ముఠా 55 మంది రైతుల నుంచి రూ. కోటికి పైగా వసూలు చేసింది. కొత్తగూడెం కేంద్రంగా కార్యాలయం తెరిచి, ఫోన్‌పే, బ్యాంకుల ద్వారా నగదు జమ చేయించుకుని పరారైంది. తొలుత కొందరికి తక్కువ ధరకు యంత్రాలిచ్చి నమ్మకం కలిగించి ఈ మోసానికి పాల్పడ్డారు.

February 20, 2026 / 07:03 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

JGL: సీఎం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పెగడపల్లి మండల కేంద్రంలోని ZP ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల HM లలిత, ఫిజికల్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. 10వ తరగతి చదువుతున్న యోగేశ్ జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగేశ్‌ను ఎంఈవో, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.

February 20, 2026 / 07:02 PM IST

అందుబాటులోకి రానున్న సోలార్ ఎనర్జీ

MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో త్వరలో సోలార్ ఎనర్జీ అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మూడు గ్రామాలను ఎంపిక చేయగా అందులో వెంకట్రావుపేట ఒకటి. ఆ గ్రామానికి మొత్తం 1139 సోలార్ యూనిట్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. అందులో ప్రస్తుతం 400 సోలార్ యూనిట్లను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో గ్రామంలో సోలార్ ఎనర్జీ అందుబాటులోకి రానుంది.

February 20, 2026 / 07:02 PM IST

పనులను ప్రారంభించిన గ్రంథాలయ ఛైర్మన్

JN: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా వివిధ గ్రామాలకు నీరు అందించేందుకు గాను కాలువల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులను నేడు జనగామ గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు ప్రారంభించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ అన్నారు.

February 20, 2026 / 07:01 PM IST

‘గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం’

KNR: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో స్థానిక సర్పంచులకు ట్రైనింగ్ జరిగింది. పంచాయతీ రాజ్ చట్టంపై సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సంక్షేమ పథకాలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

February 20, 2026 / 07:01 PM IST

రబీ సీజన్లో శనగలకు మద్దతు ధర రూ. 5,875 వేలు

తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా ఒక్కింటికి రూ. 5,875 వేల చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.

February 20, 2026 / 07:01 PM IST

ప్రారంభమైన చెన్నకేశవ స్వామి ఉత్సవాలు

సత్యసాయి: పుట్టపర్తిలోని పెద్ద కమ్మవారిపల్లిలో శ్రీ చెన్నకేశవ స్వామి, పోతలయ్య, బంగారు లింగమయ్య వార్షిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. దారపునేని చంద్రశేఖర్ నివాసం నుంచి స్వామివారి వెండి కవచాలను ఉరుము, డప్పు వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు యలువగంప మహోత్సవం నిర్వహించారు.

February 20, 2026 / 07:00 PM IST

వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

RR: కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ సందర్భంగా లే మామిడి గ్రామానికి చెందిన పలువురు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

February 20, 2026 / 07:00 PM IST

జగన్‌తో కలిసి ప్రయాణించిన శింగనమల నేతలు

ATP: YSR కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత పర్యటనలో భాగంగా వీరు వెళ్లినట్లు తెలుస్తోంది. విమాన ప్రయాణంలో నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై జగన్ చర్చించినట్లు సమాచారం.

February 20, 2026 / 07:00 PM IST

ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలి: MLA

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో మెప్మా సహకారంతో సారీ రోలింగ్ షాపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి షాపును ఓపెన్ చేశారు. పొదుపులో వచ్చే రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణాలను అందజేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలన్నారు.

February 20, 2026 / 07:00 PM IST