• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా శ్రీ అసిరి తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

SKLM: పోలాకి మండలం గంటపేట గ్రామంలో ఉన్న శ్రీ అసిరి తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య అమ్మవారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయన వెంట ఎంపీపీ బైరాగి నాయుడు, మండల వైసీపీ అధ్యక్షులు కృష్ణారావు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మణరావు, తదితరులు ఉన్నారు.

March 1, 2026 / 10:57 AM IST

మూసీ బాధితులను పరామర్శించిన కేటీఆర్

TG: హైదరాబాద్‌లోని హైదర్‌షాకోట్‌కు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లింది. గంధంగూడలో మూసీ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మూసీ బాధితులతో కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్టలు కొడుతుందని మండిపడ్డారు.

March 1, 2026 / 10:54 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైస్ ఛైర్ పర్సన్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన కైతోజు స్వర్ణలత అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు మృతురాలు ఇంటికి వెళ్లి ఆమె పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కౌన్సిలర్ తదితరులు ఉన్నారు.

March 1, 2026 / 10:53 AM IST

ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేసిన దర్శన్ కాలనీవాసులు

SRD: అమీన్‌పూర్ దర్శన్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు ఆదివారం ఎమ్మెల్సీని విన్నవించారు. త్రాగునీరు, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్సీ జీహెచ్ఎంసీ డీఈ వెంకటరమణతో మాట్లాడి రోడ్లు, త్రాగునీటి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

March 1, 2026 / 10:52 AM IST

శ్రీరంగపురంలో శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

WNP: శ్రీరంగపురం శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం మూలమంత్ర హవనం, మంటపోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారు హనుమద్వాహనంపై తిరువీధి సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు కోరారు.

March 1, 2026 / 10:52 AM IST

సరైన ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపం

BDK: సరైన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన జశ్వంత్ నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్ వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అని తన సోదరుడికి వాట్సాప్ మెసేజ్ ఇవాళ వెలుగులోకి వచ్చింది. భద్రాచలం వ్యాపారి కంభంపాటి శ్రీనివాస్ కుమారుడు జశ్వంత్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంబీఏ పూర్తి చేసిన జశ్వంత్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు.

March 1, 2026 / 10:52 AM IST

ఇక పై “ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం

HYD: ఇక పై “ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం నిర్వహించనున్నట్లు నూతనంగా దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతు రావు తెలిపారు. ఇది ప్రజావాణి తరహాలో ప్రతి వారం నిర్వహించబడుతుంది. ప్రతి సోమవారం డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ కార్యాలయంలో దరఖాస్తు స్వీకరించనున్నారు. పరిష్కారం అనంతరం దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు.

March 1, 2026 / 10:50 AM IST

కేయూ పురుషుల చెస్ జట్టు ఎంపిక

HNK: తమిళనాడులోని తిరుచిరాపల్లి భారతీదాసన్ యూనివర్సిటీలో మార్చి 2, 3 తేదీల్లో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయం జట్టు పాల్గొననుంది. కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకయ్య ఈ మేరకు వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయం నుంచి పి. శ్రీ చైతన్య, ఎస్. సంజయ్ చంద్ర, శివ సాత్విక్, సచిన్, జై శివకుమార్ ఎంపికయ్యారు.

March 1, 2026 / 10:49 AM IST

అక్రమ గంజాయి పట్టివేత

BDK: భద్రాచలం ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీల్లో గంజాయి రవాణాను అడ్డుకున్నారు. సీలేరు–మోతుగూడెం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, సుమారు 20 కేజీల గంజాయి, కారు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ.11 లక్షలు ఉంటుందన్నారు.

March 1, 2026 / 10:48 AM IST

తవ్వాకాల్లో బయటపడ్డ విగ్రహం

NZB: భీంగల్ మండలం ముచ్కూర్ పెద్దగుట్టపై వందల ఏళ్ల నాటి నర్సింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. దారి మూసుకుపోయిన ఈ ప్రాచీన ఆలయాన్ని తెరిపించేందుకు గ్రామస్తులు, వేద పండితులు తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో స్వామివారి తొలి అవతారమైన వరాహ స్వామి విగ్రహం బయటపడింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

March 1, 2026 / 10:46 AM IST

తైక్వాండో పోటీలు ప్రారంభించిన మేయర్

NZB: జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ ఉమారాణి రమేష్ పాల్గొని ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరాటే, తైక్వాండో రెండు కూడా ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుందని, విద్యార్థి దశ నుండే శిక్షణ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజిద్, అజ్మత్ పాల్గొన్నారు.

March 1, 2026 / 10:43 AM IST

ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్న సర్పంచ్

BDK: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, బయోడిగ్రేడబుల్ బ్యాగులను వాడాలని సర్పంచ్ గూగులోతు జానకిరామ్ సూచించారు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని కోరారు. ఆదివారం పలు కిరాణా షాపులను తనిఖీ చేసి, ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.

March 1, 2026 / 10:42 AM IST

నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

TG: మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇవాళ ఎత్తనున్నట్లు SRSP ఏఈఈ రవి తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఏటా మార్చి 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి 0.60 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం అధికారులు విడుదల చేస్తుంటారని పేర్కొన్నారు.

March 1, 2026 / 10:40 AM IST

నిరుపయోగంగా మారిన జీడీసీసీ బ్యాంక్ భవనం

PLD: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శావల్యాపురం సొసైటీ ఆవరణలో రూ. 40 లక్షలతో జీడీసీసీ బ్యాంక్ భవనాన్ని నిర్మించారు. ఆర్బీఐ అనుమతులు రాకపోవడంతో ఆ భవనం నిరుపయోగంగా మారింది. ఫలితంగా స్థానిక రైతులు నగదు విత్‌డ్రా కోసం వినుకొండ వరకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

March 1, 2026 / 10:40 AM IST

నగరంలో పెరుగుతున్న డ్రగ్స్ కేసులు

విశాఖ: నగరంలో డ్రగ్స్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, గోవా నుంచి డ్రగ్స్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల పెందుర్తి, ఎంవీపీ ప్రాంతాల్లో ఎండీఎంఏ స్వాధీనం చేసుకుని యువకులను అరెస్ట్ చేశారు.

March 1, 2026 / 10:38 AM IST