NRML: గ్రూప్ 2 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్-2 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.