ASR: కొయ్యూరు మండలంలో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి రాజేంద్రపాలెంలో విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పలువురి గ్రామస్తులకు చెందిన ఇన్వర్టర్లు, కూలర్లు, గ్రైండర్లు, బల్బులు, టీవీలు, ఫ్యాన్లు తదితర విద్యుత్ ఆధారిత గృహోపకరణాలు, సామాగ్రి కాలిపోయాయని బాధితులు గురువారం ఉదయం తెలిపారు.