పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ దౌత్య ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ చర్యలకు గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మరోవైపు కశ్మీర్ దాడికి ప్రధాన సూత్రధారైన LeT చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాక్ ప్రభుత్వం లాహోర్‌లో భద్రత కల్పిస్తోంది.