కర్నూలు: కోడుమూరు టీడీపీ కార్యకర్తకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. ITDP మండల అధ్యక్షుడైన రవిశంకర్ తన పండంటి కుమారుడికి శ్వాసకోస ఇబ్బంది ఉండటంతో విజయవాడ AIIMSలో చేర్పించారు. చికిత్సకి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోందని, సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా లోకేశ్‌ను కోరారు. స్పందించిన ఆయన ‘నా టీమ్ మీతో మాట్లాడి అవసరమైన సాయం చేస్తుంది’ అని హామీ ఇచ్చరు.