ప్రకాశం: LSDG ట్రైనింగ్‌లో భాగంగా సంతమాగులూరు మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శివప్రసాద్‌తో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొని స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ గురించి వివరించారు.