కృష్ణా: తిరువూరు మండలంలోని కాకర్లలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 35 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్సై వి. కృష్ణవేణి తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విస్సన్నపేట మండలం, వేమిరెడ్డిపల్లి తండాకి చెందిన బాణావత్ వినోద్ కుమార్ బైక్ పై అక్రమంగా సారా తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.