SKLM: పాతపట్నం నియోజకవర్గంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో CSR నిధుల ద్వారా పాతపట్నం M.సీది గ్రామంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సూత్ర ప్రాయ ఆమోదం లభించినట్లు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2.41 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు.
NLR: ASపేట(M) వేల్పులగుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం, మరో రూ. 2 లక్షలతో మంజూరు చేసిన నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, రూ.31 లక్షలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు.
చర్మ సౌందర్యానికి ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగడం ముఖ్యం. జంక్ ఫుడ్, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. నిత్యం సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ రాస్తూ మెడ, కళ్ల కింద మృదువుగా మర్దన చేయాలి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి, కానీ ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. మొటిమలు, మచ్చలను గిల్లడం వంటివి చేయరాదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
PLD: మాచర్ల పట్టణంలోని వినాయకుని గుట్ట 28, 29వ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పరిశీలించారు. రూ.2 కోట్ల 65 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
NTR: విజయవాడ గాంధీనగర్లో శనివారం ఎస్సై సరళ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
ప్రకాశం: వెలిగండ్లలో అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన ఫ్యాన్లు, కుర్చీలు పంపిణీ చేశారు. శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ సహకారంతో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి ఈ సామగ్రిని అందజేశారు. చిన్నారులకు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం అందించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్థానిక ప్రజలు, సిబ్బంది ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సంగారెడ్డి: పోలీస్ స్టేషన్లో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారుడికి భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం SP ఆఫీస్‌లో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు.
NDL: కొలిమిగుండ్ల(మం) కోరుమానుపల్లిలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామ సమీపంలో ఉన్న గుండం ఆంజనేయ స్వామి వద్ద నూతనంగా నిర్మించిన పట్టాభి రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాశం: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు మండలం కరవది గ్రామంలోని వివేకానంద విద్యావిహార్‌లో శాస్త్ర ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ మోడల్ ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకుని అబ్బురపరిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని తెలిపారు.
WGL: వరంగల్ లోని మామునూరు విమానాశ్రయ రన్‌వే పొడవు 2.5 కి.మీ.కి కుదించడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో పెద్ద విమానాలు, అంతర్జాతీయ విమానాలు దిగడానికి వీలు కాదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బేగంపేట 3.2 కి.మీ., శంషాబాద్ 4.2 కి.మీ., విజయవాడ 3.36 కి.మీ. రన్‌వేలతో ఉండగా, వరంగల్‌ను 2.5 కి.మీ.కి పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
JN: పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రేపు డాక్టర్ ఏలే శిరీష్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ మాచర్ల స్వరూప తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సత్యసాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో పౌర సరఫరాల ఉప తహసీల్దార్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం అక్రమ రవాణా చేసే వారిపై సెక్షన్ 7 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జేసీ ఆదేశించారు. రేషన్ షాపులు నిర్ణీత సమయాల్లో తెరవాలని, 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దకే సరుకులు అందించాలని ఆయన సూచించారు.
BPT: మార్టూరు మండలం కొలలపూడి గ్రామంలో శనివారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వింటా శనగలకు ప్రభుత్వం రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. రైతు స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని, అన్నదాతల ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లోని అద్దాల తలుపులు, కిటికీలపై ‘X’ గుర్తును గమనించే ఉంటారు. అద్దాలు పారదర్శకంగా ఉండటం వల్ల కార్మికులు వాటిని గుర్తించలేరు. నిచ్చెనలు, ఇనుప రాడ్లతో వెళ్తున్నప్పుడు పొరపాటున ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు హెచ్చరికగా ‘X’ గుర్తు వేస్తారు. నిర్మాణం పూర్తికాగానే ఈ టేపును తొలగిస్తారు. ఇది కార్మికుల భద్రత కోసం మాత్రమే.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలం పేలుడు ఘటనలో 20 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న హోంమంత్రి అనిత విజయనగరం నుంచి ఘటనాస్థలానికి హుటాహుటిన బయల్దేరారు. ఈ క్రమంలో ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.