• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హిందీలో మూడో స్థానం సాధించిన ‘సిరివెన్నెల’

W.G: హిందీ మాట్లాడటం, ఉపన్యాసించడంలో పెంటపాడు(M) కస్పా పెంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని నాతిరెడ్డి సిరివెన్నెల జిల్లా స్థాయిలో మూడవ స్థానం సాధించినట్లు ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్ తెలిపారు. శనివారం స్కూలు ఆవరణలో విద్యార్థిని సిరివెన్నెలను అభినందించారు. బాలికను సహచర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

February 28, 2026 / 03:50 PM IST

ఆయన మృతి టీడీపీకి తీరని లోటు: ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గంలోని పలువురు మృతుల కుటుంబాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పరామర్శించారు. రెడ్డిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గుడిపూడి వెంకట నారాయణ ఇటీవల మృతి చెందారు. ఆయన చిత్రపటానికి పుష్పములు సమర్పించి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటని వ్యాఖ్యానించారు.

February 28, 2026 / 03:50 PM IST

యూ టర్న్ లేక ఇబ్బందులు..!

VKB: కొడంగల్-తాండూర్ రూట్‌లో చేపడుతున్న హైవేపై మధ్యలో చేపడుతున్న డివైడర్ నిర్మాణాల్లో కనీసం యూ-టర్న్‌లు ఏర్పాటు చేయకపోవడంపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రూట్లో KADA ఆఫీస్, మర్కెట్ యార్డ్, సబ్‌స్టేషన్ ఉన్నాయని చెబుతున్నారు. గమ్య స్థానాలకు చేరుకోవడానికి కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు.

February 28, 2026 / 03:50 PM IST

2,36,152 మందికి రూ. 103. 86 కోట్లు పెన్షన్లు పంపిణీ

KRNL: మార్చి మాసంలో కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన 2,36,152 మంది లబ్ధిదారులకు రూ. 103.86 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం మద్దూర్ నగర్‌లోని అమ్మ వృద్ధుల శరణాలయంలో కలెక్టర్ పలువురికి పెన్షన్లు అందజేశారు.

February 28, 2026 / 03:49 PM IST

పేలుడు ఘటన.. జగన్ దిగ్భ్రాంతి

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై మాజీ CM జగన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలన్నారు. కాగా, ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

February 28, 2026 / 03:48 PM IST

సేవలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న MLA, కలెక్టర్

BHPL: జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLA గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా జాతికి విద్యా-విజ్ఞాన దిశానిర్దేశం చేసిన మహనీయుడని కలెక్టర్ రాహుల్ శర్మ కొనియాడారు.

February 28, 2026 / 03:48 PM IST

గద్వాల బాలికల పాఠశాలలో సైన్స్ దినోత్సవం

గద్వాల: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రయోగాలను ఆసక్తిగా పరిశీలించి వివరాలు అడిగారు. కలెక్టర్ విద్యార్థులను లక్ష్యం నిర్దేశించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని ప్రేరేపించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 28, 2026 / 03:46 PM IST

పిడుగురాళ్లలో ‘స్వచ్ఛ రథం’ను ప్రారంభించిన MLA

PLD: పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం స్వచ్ఛ రథం”ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడమే లక్ష్యమని, ప్రజలు చెత్త వర్గీకరణకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 28, 2026 / 03:45 PM IST

అలిపిరి వద్ద ఆప్ నేతల కృతజ్ఞత కార్యక్రమం

TPT: తిరుపతి అలిపిరి పాదాల వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు “నిజాయితీ గెలిచింది” కార్యక్రమం నిర్వహించి న్యాయస్థానం తీర్పుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నీరగట్టు నగేష్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి ట్రేడ్ మార్క్ అని నేతలు పేర్కొన్నారు.

February 28, 2026 / 03:45 PM IST

పరీక్షకు 140 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో 34 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 140 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 5,420 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా.. 5,280 హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీకు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 03:45 PM IST

పిచ్చికుక్క దాడి.. ఐదుగురికి గాయాలు

ASR: రంపచోడవరం మండలంలో పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు రంపచోడవరం ఎంపీపీ పాఠశాల ఆవరణలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ అటుగా వెళుతున్న వారిని గాయపరుస్తుంది. శనివారం మధ్యాహ్నం వరకు ఐదుగురు గాయపడి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రాగ వైద్యులు ట్రీట్మెంట్ అందించారు.

February 28, 2026 / 03:44 PM IST

కడియంపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

TG: పార్టీ ఫిరాయింపు విషయంలో MLA కడియం శ్రీహరిపై BRS ఎమ్మెల్యే వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను కాంగ్రెస్‍లో చేరినట్టు వచ్చిన వీడియోలు, ఫొటోలు AI అని కడియం అంటున్నారు. సిగ్గులేకుండా ఇంకా BRSలోనే ఉన్నట్లు వాదిస్తున్నారు. రాహుల్ గాంధీతో దిగిన ఫొటోలు కూడా AI ఫోటోలేనని చెప్పారు. రాజకీయంగా కడియం సమాధి కాక తప్పదు’ అని హెచ్చరించారు.

February 28, 2026 / 03:44 PM IST

పేలుడు ఘటన.. భారీగా పెరిగిన మృతులు

AP: కాాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవదహనం అయ్యారు. అయితే, ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా మారింది.

February 28, 2026 / 03:44 PM IST

2,57,658 మందికి రూ.113.09 కోట్లు పంపిణీ

ఏలూరు 17వ డివిజన్ గాంధీ మైదాన ప్రాంతంలో శనివారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 2,57,658 మందికి రూ. 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేసామన్నారు. ఇందుకు జిల్లాలో 5047 మందిని నియమించినట్లు తెలపారు.

February 28, 2026 / 03:41 PM IST

బయో-మెడికల్ వ్యర్థాలతో ప్రమాదాలను తగ్గించాలి: కలెక్టర్

CTR: బయో-మెడికల్ వ్యర్థాలతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి జరిగే ప్రమాదాలను తగ్గించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యర్థాల నిర్వహణపై జిల్లా మానిటరింగ్ కమిటీ నిర్వహించారు. డీఆర్‌వో మోహన్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 03:40 PM IST