AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేట్లపాలెం పేలుడు ఘటన బాధితులను పరామర్శించారు. ఈ మేరకు కాకినాడ GGHకి వెళ్లిన ఆయన.. క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యలుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.