• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరసన

సంగారెడ్డి: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో మంగళవారం జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. అనంతరం సమగ్ర శిక్షా ఉద్యోగులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

December 10, 2024 / 01:48 PM IST

విష ద్రావణం తాగి వివాహిత ఆత్మహత్య

ATP: గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బేతాపల్లి గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళ అనారోగ్య సమస్యతో విషద్రావణం తాగి మంగళవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్నా ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

December 10, 2024 / 01:48 PM IST

నేడు రాజస్థాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనమై.. అక్కడి నుంచి రాజస్థాన్‌కు చేరుకోనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి సీఎం అక్కడకు వెళ్లనున్నారు. ఈ నెల 11,12,13 తేదీల్లో అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ బంధువుల పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ఈ పర్యటన ఖరారైనట్లు సమాచారం.

December 10, 2024 / 01:45 PM IST

కేశవాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు

ATP: గార్లదిన్నె మండలంలోని కేశవాపురం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిన రెవెన్యూ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల గురించి భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.

December 10, 2024 / 01:45 PM IST

రెవెన్యూ సదస్సులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

సత్యసాయి: లేపాక్షి మండల పరిధిలోని సిరివరం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మంగళవారం గ్రామంలోని సచివాలయ ఆవరణంలో రెవెన్యూ సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

December 10, 2024 / 01:42 PM IST

‘ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వామి కావాలి’

MNCL: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణలో విధిగా భాగస్వామి కావాలని సేఫ్టీ కమిటీ కన్వీనర్ హబీబ్ హుస్సేన్, మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు. మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని పై రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా రక్షణ కమిటీ పర్యటించింది. గనిలో చేపడుతున్న రక్షణ చర్యలను కమిటీ సభ్యులు తనిఖీ చేశారు.

December 10, 2024 / 01:42 PM IST

ఈనెల 13న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

ATP: కూడేరు మండల కేంద్రంలో ఈనెల 13న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ కలశ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆలయ అర్చకుడు రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 7 గంటలకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని కావున మండల ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.

December 10, 2024 / 01:41 PM IST

క్రీడలను ప్రారంభించిన అదనపు కలెక్టర్

KMR: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎల్లారెడ్డి పాఠశాల మైదానంలో ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో RDO, ఉపాధ్యాయులు, స్థానిక మండల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 01:41 PM IST

ధర్మవరంలో జనసేనలోకి చేరికలు

సత్యసాయి: ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన 70 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు వేసి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తిమ్మయ్య, నారాయణ స్వామి, సూర్యనారాయణ, మణికంఠ పాల్గొన్నారు.

December 10, 2024 / 01:41 PM IST

ఈవీఎంల గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్

BHPL: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంగళవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సాధారణ తనిఖీలో భాగంగా గోడౌన్‌లోని సీసీ కెమెరాలు, భద్రతా పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపారు. గోదాం భద్రతకు ఎల్లప్పుడు పటిష్ఠ, సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, భద్రత మరింత పెంచాలని అధికారులను సిబ్బందిని సూచించారు.

December 10, 2024 / 01:37 PM IST

జడ్పీ హైస్కూల్ తనిఖీ చేసిన డీఈవో

KNR: కథలాపూర్ మండలకేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ను జిల్లా విద్యాధికారి రాము మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా తయారు చేస్తున్నారని నిర్వాహకులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణ నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలను పరిశీలించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

December 10, 2024 / 01:37 PM IST

సానా సతీష్‌ను కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ

E.G: ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మంగళవారం సానా సతీష్‌ను కలిశారు. ఆయనను రాజ్యసభ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయడంతో వారు సతీష్‌కు అభినందనలు తెలియజేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారని, తగిన గుర్తింపు లభించిందని అన్నారు. ఆయన మరింత ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఎమ్మెల్యే అన్నారు.

December 10, 2024 / 01:34 PM IST

పోలీసుల విస్తృత తనిఖీలు

MNCL: మావోయిస్టుల రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వేమనపల్లి మండలం ఎస్సై శ్యామ్ పటేల్ తనిఖీలు చేపట్టారు. వేమనపల్లి సరిహద్దు ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద అవతలి వైపు మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలు నడిపే వారితో మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు పడవెక్కితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

December 10, 2024 / 01:33 PM IST

సీఐటీయు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల రాస్తారోకో

KMM: చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టి ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించాలని సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ కోరారు. అశా వర్కర్ల ఆక్రమ అరెస్టులను ఖండిస్తూ నెహ్రూ సెంటర్‌లో అందోళన నిర్వహించారు. ఆశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

December 10, 2024 / 01:32 PM IST

‘స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి’

ATP: గుంతకల్లు మండలం నెలగొండ గ్రామంలో మంగళవారం తహశీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేలకొండ గ్రామంలో హిందూ స్మశాన వాటికకు స్థలము కేటాయించాలని గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీపీ మాధవి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

December 10, 2024 / 01:32 PM IST