RR: పంట నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ విస్తరణ అధికారులు వాలంటీర్ల సహాయంతో గ్రామాల్లోకి వెళ్లి పంటలను నమోదు చేయాలని కోరారు. అదేవిధంగా యూరియా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.