కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు గ్రామ పెద్దలతో కలిసి సోమవారం తాలూకా ఎస్సై శేఖర్ బాబు శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన సోమవారం గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఇచ్చిన వ్యవది లోపే వాటిని తొలగించాలని ఎస్సై సూచించారు.
TPT: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ సోమవారం పరిశీలించారు. విద్యార్థినులకు ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయిలో నాణ్యమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధ్యాపకులకు సూచించారు. కళాశాలలోని ల్యాబ్‌లు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో కూడా మాట్లాడారు.
SKLM: మందస గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన మురుగు నీరు, వర్షం నీరు ప్రవహించే కాలువ ఆక్రమణకు గురైంది. ఆక్రమణదారులు కాలువను ఆక్రమించి, పూడ్చి వేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సోమవారం స్థానిక మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
SRPT: చివ్వెంల మండలంలోని వల్లబాపురం గ్రామ శివారులో ఇటుకల బట్టిలో పనిచేసే కార్మికుడు పల్లపు రాజు ( 35 ) ఇవాళ ఇటుకల బట్టిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతిని స్వగ్రామం సూర్యాపేట చెందినవాడిగా విశ్వసనీయ సమాచారం. సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
ASF: కొమురంభీం గొప్ప పోరాటయోధుడని, ఆయన ఆదివాసీల కోసం చేసిన పోరాటం, త్యాగం మరువలేనిదని ప్రముఖ కవి జయరాజ్ అన్నారు. ఈ క్రమంలో ప్రకృతి విజ్ఞాన యాత్రలో భాగంగా సోమవారం జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీ ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళుర్పించారు.
NGKL: తెలకపల్లి మండలం ఆలేరులో హరితహారం మొక్కలను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అదనపు కలెక్టర్ దేవసహాయంకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఆనంద్, కార్యదర్శి మహేశ్ సహకారంతో గట్టు బాలిశ్వరయ్య అనే వ్యక్తి మొక్కలను నరికినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KRNL: 20 ఏళ్లుగా మీడియా రంగంలో సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్, ఓ పత్రిక ఎడిటర్ జేమ్స్ ఆనందరావు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతిపట్ల జర్నలిస్టు సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి. జేమ్స్ లేని లోటు మీడియా రంగంలో తీరనిదని పేర్కొన్నారు. ఆయన మృతితో జిల్లాలో జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వనపర్తి జిల్లాలో అంబేద్కర్ కళా భవనం నిర్మించాలని కోరుతూ సోమవారం జిల్లా ప్రజావాణిలో సామాజిక వేత గంధం నాగరాజు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దళితులకు అంబేద్కర్ పేరు మీద భవనం చేపట్టి దళితులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. మారమ్మ కుంట దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలో నిర్మించాలని కోరారు.
SKLM: ఎచ్చెర్ల మండలం లింగాలపేట గ్రామంలో వెలసిన శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ 10వ వార్షికోత్సవాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త సరఫరా బాలకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కరపత్రాలను ఆవిష్కరించారు. అర్చకులు కాళిదాసు, చంద్రకుమార్ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కాకినాడ: తుని మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 66 రోజులకు గాను రూ. 46,21,025 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజు తెలిపారు. పర్యవేక్షణాధికారులుగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సీహెచ్ సురేష్ నాయుడు వ్యవహరించారు.
KNR: శంకరపట్నం మండలం తాడికల్ రైతు వేదికలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్, మెట్పల్లి, కేశవపట్నం, వంకాయగూడెం, తాడికల్, ఇప్పలపల్లి, అంబాలాపూర్, కరీంపేట, చింతగుట్ట, ఏరడపల్లి గ్రామాల నూతన వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం 2018 పై శిక్షణ ప్రారంభమైంది. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన ఈనెల 27 వరకు కొనసాగనుంది. పంచాయతీ కార్యదర్శులు, 9 గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు.
AP: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా ఫైనల్ చేరితే తప్పనిసరిగా మ్యాచ్ చూసేందుకు వెళ్తానని మంత్రి లోకేష్ వెల్లడించారు. మ్యాచ్ చూసేందుకు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కూ టికెట్ తీసుకుంటానని తెలిపారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు తాను వెళ్లడంపై వైసీపీ చేసిన విమర్శలకు అసెంబ్లీ లాబీలో లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
AP: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా ఫైనల్ చేరితే తప్పనిసరిగా మ్యాచ్ చూసేందుకు వెళ్తానని మంత్రి లోకేష్ వెల్లడించారు. మ్యాచ్ చూసేందుకు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కూ టికెట్ తీసుకుంటానని తెలిపారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు తాను వెళ్లడంపై వైసీపీ చేసిన విమర్శలకు అసెంబ్లీ లాబీలో లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
KMM: మున్సిపల్ ఛైర్మన్ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా మండలంలోని పడమటిలో కారంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పశు వైద్యులు మూగజీవాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
NTR: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉన్నందున అనవసరంగా ఎవరూ గుమికూడరాదని, తల్లిదండ్రులు,ప్రజలు సహకరించాలని ...