సిద్దిపేట స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం వార్షిక క్రీడా పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. క్రీడలను ప్రారంభించిన అనంతరం ఆమె ప్రసంగించారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీసులు ప్రతిభకనబరచడం అభినందనీయమన్నారు.