రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణాన్ని కాదని బైపాస్ మీదుగా బస్సులు నడుపుతున్నారు. దీనివల్ల ఇక్కడ ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. మరోవైపు ప్రయాణికులు లేక మీరు ఖాళీ బస్సులతో తిరుగుతున్నారు. బస్సులను బైపాస్ మీదుగా కాకుండా షాద్ నగర్ మీదుగా నడపండి.. అంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆర్టీసీ ఆర్ఎం సంతోష్ కుమార్‌ను కోరారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూవీగా రికార్డుకెక్కినట్లు పేర్కొన్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకట...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం OTTలో అదరగొడుతోంది. ఇండియా వ్యాప్తంగా టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది.
NLR: కలువాయి మండలం పర్లకొండలో పంట పొలాల్లో మంగళవారం రాత్రి కొల్లూరు గోపి (27) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపినట్లు తెలుస్తోంది. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి హత్య గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
MNCL: బెల్లంపల్లి జాతీయ రహదారి బైపాస్ జంక్షన్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ మూలమలుపు వద్ద రెండు కార్లు ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో హనుమాన్ బస్తీకి చెందిన తిరుపతి అక్కడిక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న అతడి భార్య, కూతురు, మనవడికి తీవ్రగాయాలైనట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 14న అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందని అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆత్మకూరు పట్టణంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన కరపత్రాలను సేవా సమితి సభ్యులు విడుదల చేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కృష్ణా: రాష్ట్రంలో నష్టపోతున్న రైతన్నలకు అండగా నిలుస్తూ, వారిని ఆదుకోవాలన్న నినాదంతో ఈనెల 13న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుడివాడ వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జరగనున్న “రైతన్నకు అండగా వైసీపీ” నిరసన కార్యక్రమ ప్రచార కరపత్రాలను పార్టీ నేతలు భయ్యావారి వీధిలోని జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరావు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు.
NDL: నందికొట్కూరు పట్టణం సాయిరాం కాలేజీ ఎదురుగా జనసేన నాయకులు మద్దిలేటిగారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాగిముద్ద పాయింట్‌ను నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
AP: గత ఐదేళ్లు దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడినపెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నూతనంగా 20 విధానాలు తీసుకొచ్చాం. ప్రభుత్వంలో స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. అభివృద్ధి జరగాలంటే హార్డ్ వర్క్ మాత్రమే కాదు స్మార్ట్ వర్క్ కావాలి. గత పాలనలో మద్యం మాఫియా పెరిగింది. రేషన్ బియ్యం మాఫియాను పెకిలించాలి. తప్పు చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి’ అని ...
SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమావేశ శిక్ష ఒప్పంద ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దత్తు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. 20 సంవత్సరాల నుంచి చాలీచాలని విత్తనాలతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్నాలు సమక శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.
మోహన్ బాబు, మనోజ్ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ‘మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మేము కలిసి ఉంటాం అనుకున్నా.. కానీ పరిస్తితులు ఇలా మారుతాయనుకోలేదు. గేట్లు పగులగొట్టి మనోజ్ ఇంట్లోకి వచ్చాడు. నిన్న జరిగిన దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆసుపత్రి పాలైంది. ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిదిపై మా నాన్న దాడి చేయలేదు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు’ అని ...
SRD: జోగిపేటలో కురుమ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన కురుమ సంఘ ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈనెల 14న, సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ది రామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా జరిగే కోకాపేటలో దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మ భవన ప్రారంభోత్సవ కరపత్రాలను సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు, కార్పొరేటర్ పుష్ప నగేష్ ఆవిష్కరించారు.
ప్రకాశం: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఖాళీల భర్తీ చేసేందుకు బుధవారం ప్రాజెక్టు డైరెక్టర్ శారద నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న 15 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 4 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 89 ఆయాల పోస్టులు భర్తీచేయనున్నారు. ఈ నెల 11 నుండి 23లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఖమ్మం: సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో స్వేచ్చా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. స్థానిక రిపోర్టర్ తంబళ్ల రవి మాట్లాడుతూ.. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడులో బుధవారం అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని మండల ప్రత్యేక అధికారి రమేశ్ బాబు, తహశీల్దార్ రవిబాబు అన్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొని రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అలాగే వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.