Vsp: తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విశాఖ ఎంజీఎం 7హిల్స్ హాస్పిటల్ కార్మికులు బుధవారం ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రి నుండి ప్రారంభమైన ర్యాలీ డాబాగార్డెన్స్‌లో గల అంబేద్కర్ విగ్రహం వరకు జరిగింది. జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ 30 ఏళ్లు పని చేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు.
SKLM: కొత్తూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీస్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అంతర రాష్ట్ర బస్‌లలో కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు ఆధ్వర్యంలో రాణి అనే పేరుగల నార్కోటిక్ డాగ్‌తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఒడిశా నుండి వచ్చే బస్సులు నిసితంగా తనిఖి చేశారు. మండల కేంద్రంలో గల పాన్ షాపులు, కిరాణా షాపులను తనిఖీ చేశారు.
MNCL: దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వృద్దుని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై అధికారులకు దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వం. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయి. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు MOU కుదిరింది. దీనివల్ల విశాఖ మరింత అభివృద్...
SDPT: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పార్టీ వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, దేవాదాయ శాఖ అధికారులు.
కాకినాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, ఆల్ యూసుఫ్ ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారకి సౌదీ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు తెలిపారు. 18 నుంచి 40ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఏడాదిన్నర పాటు పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. వివరాలకు నెంబర్ 9988853335కు ఫోన్ చేయాలని సూచించారు.
ట్రంప్ కుమారుడు డొనాల్డ్ జూనియర్‌తో కింబర్లీ గిల్ఫోయిల్‌కు ఇదివరకే నిశ్చితార్థం అయింది. ట్రంప్ ఆమెను గ్రీక్ రాయబారిగా నియమించారు. గతంలో ఫాక్స్‌న్యూస్ హోస్ట్‌గా పనిచేసిన కింబర్లీ.. అనంతరం పొలిటికల్ ఫండ్ రైజర్‌గా రాణించారు. గ్రీస్‌తో రక్షణ సహకారం, వాణిజ్యం, ఆర్థిక ఆవిష్కరణలు తదితర విషయాల్లో కింబర్లీ బలమైన దౌత్య సంబంధాలు నెలకొల్పగలదని ట్ర...
ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి అన్నదాతకు అండగా వైసీపీ ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 13న జిల్లా పరిషత్ కార్యాలయంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు జరిగే ర్యాలీలో వైసీపీ నాయకులు పాల్గొనాలన్నారు.
W.G: నరసాపురం పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద ఈ నెల 13న విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఈ కె.మధు కుమార్ చెప్పారు. దీనికి వేదిక ఛైర్మన్ సత్యనారాయణ, విద్యుత్ సాంకేతిక సభ్యులు ఎస్. మణి కూడా హాజరవుతారన్నారు. మీటర్ రీడింగ్, లోఓల్టేజ్, అధిక బిల్లులు, విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చున్నారు.
NLR: తన కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానిస్తూ బుధవారం ఉదయగిరి TDP MLA కాకర్ల సురేశకు సీతారామపురం వైసీపీ మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 14న సీతారామపురం మండలం బసినేనిపల్లిలో చింతం రెడ్డి కుమార్తె శ్వేతారెడ్డి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు YCP నాయకులు పాల్గొన్నారు.
నటుడు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీసులని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తనకు భద్రత కల్పించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. రిపోర్టర్‌పై దాడి కేసులో మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.
KRNL: పాణ్యం మండల కేంద్రంలోని స్థానిక రచ్చకట్టకు చెందిన బొమ్మినేని శ్రావణి(33) మంగళవారం ఆరోగ్య, ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం పాణ్యం సీఐ కిరణ్ కుమార్‌రెడ్డి వివరాలు తెలిపారు. ఈమెకు బనగానపల్లె మండలం ఎనగండ్లకు చెందిన బొమ్మినేని బాలసుంకన్నతో 14 ఏళ్ల క్రితం వివాహం అయినట్లు తెలిపారు.
TG: మాజీమంత్రి KTRపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను స్పీకర్‌ని.. ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. BRS ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. నేను స్పీకర్ కావటానికి BRS కూడా మద్దతిచ్చింది. అసెంబ్లీలో సీనియర్ సభ్యుడైన KTR.. నాపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం వినియోగించు...
సత్యసాయి: బుక్కపట్నం డిగ్రీ కళాశాలలో క్రీడాకారులకు క్రికెట్ కిట్టును బుధవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించే బాధ్యత మనపై ఉందని, క్రీడాకారులకు తోడ్పాటు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ATP: పుట్లూరు మండల పరిధిలోని గోపురాజపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటో బోల్తా పడటంతో గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. ఎల్లనూరు మండలంలోని నిట్టూరు గ్రామానికి పొలం పనులకు వెళ్తుండగా గిర్రమ్మ బావి సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.