భారత్, రష్యాల మధ్య భాగస్వామ్యానికి అపారమైన సామర్థ్యం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మాస్కోలో 21వ ఇండియా-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ మిలిటరీ అండ్ కో ఆపరేషన్ సెషన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య స్నేహం పర్వతం కంటే ఎత్తైనదని, సముద్రం కంటే లోతైనదని కేంద్రమంత్రి అభివర్ణించారు. భారత్ తన మిత్రదేశాలకు ఎల్లప్పుడూ అ...
కృష్ణా: కోడూరు మండల పరిధిలోని విశ్వనాథపల్లి సబ్ స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ అంతరాయం నిలిపివేస్తున్నట్లు ఉయ్యూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. కృష్ణనాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని పిట్టలంక రూరల్ ఫీడర్, ఎక్స్‌ప్రెస్ ఫీడర్ RDSS పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా: అయ్యప్ప భక్తులకై నరసాపురం(NS)-కొల్లామ్(QLN) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2025 జనవరి 20, 27న NS-QLN(నం.07157), అదే నెలలో 22, 29న QLN-NS(నం.07158) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో కైకలూరు, గుడివాడ, విజయవాడలో ఆగుతాయన్నారు.
ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. రాజ్యసభకు బీదా మస్తాన్ రావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో జిల్లా అభివృద్ధి అంశాలపై దామచర్ల చర్చించారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించారు.
NTR: మండల కేంద్రమైన ఏ.కొండూరు గ్రామానికి చెందిన కలవకట్లు నవీన్ అనే యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. నవీన్ భార్య కాపురానికి రాకపోవటంతో మనస్థాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని జిల్లా జైలును మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భారతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్యామ్ బాబులు జైలును సందర్శించి, అనంతరం ఖైదీలకు కల్పించిన సదుపాయాలను వారు పరిశీలించారు.
CTR: పుంగనూరు నాగపాళ్యంలోని ఓవస్త్ర దుకాణంలో ఇద్దరు యువకులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం దుకాణంలో ఎవరూ లేని సమయంలో ఇద్దరు యువకులు బట్టలను దొంగలించారు. ఎప్పటిలాగే దుకాణం మూసే ముందు అదే రోజు రాత్రి యజమాని సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
విశాఖ జోన్-1 పరిధిలో విద్యుత్తు లైన్ల మరమతులతో పాటు చెట్ల కొమ్మలు తొలగింపు పనులు చేపడుతున్న కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని ఈఈ సింహాచలం నాయుడు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్కే నగర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
TPT: జాతీయ స్థాయి అండర్ – 14 బేస్ బాల్ పోటీలకు చంద్రగిరి పరిధి మంగళంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రమ్యశ్రీ, అజిత, తోఫిక్ ఎంపికయ్యారు. దీంతో పాఠశాల HM కేశవులు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు అభినందనలు తెలిపారు.
AP: దేశంలో అత్యంత పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్ కాగా, ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం. గతంలో ఏపీ తీర రేఖ పొడవు 973.7 కిలో మీటర్లు ఉండేది. అయితే కేంద్ర జలసంఘం(CWC) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో రాష్ట్ర తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు అని తెలిపింది. కాగా.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి దేశంలో తీర ప్రాంతంపై CWC ఇటీవల అధ్యయనం చేసి కీలక విషయాలు వెల్లడించింది.
SRD: ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్మీడియట్‌లో చేరెందుకు బుధవారం చివరి తేదీ అని జిల్లా విజాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నేరుగా సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించి దరఖాస్తు తీసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రకాశం: కనిగిరికి చెందిన సామాజిక వేత్త గుత్తి శ్రీధర్ ఎన్‌హెచ్ఆర్‌సీ నేషనల్ అడిషనల్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. విశాఖపట్నంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎన్‌హెచ్ఆర్‌సీ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ నియామక పత్రాలను అందజేశారు. మానవ హక్కుల పరిరక్షణకు ఎన్‌హెచ్ఆర్‌సీ కృషి చేస్తుందని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని శ్రీధర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఉదయం 6, 7, 8 మధ్యాహ్నం 9, 10 తరగతులకు నిర్వహిస్తారు.
అన్నమయ్య: రాష్ట్రస్థాయి తెలుగు ఉత్తమ ఉపాధ్యాయినిగా ములకలచెరువు మండలం సోంపల్లె గ్రామానికి చెందిన బిసన నిర్మలమ్మ ఎంపికైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ అనిల్ కుమార్ దివేది తెలిపారు. ఈమె కురబలకోట మండలం ముదివేడులోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయినిగా రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యారు.
ELR: విద్యుత్ ఘాతకానికి గురై మహిళ మృతి చెందిన ఘటన కామవరపుకోట మండలం వడ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్వరి ఇంటి లోపల బీరువాలో బ్యాగ్ పెడుతుండగా బీరువాకు విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురై మృతి చెందింది. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.