ప్రకాశం: జిల్లాలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని మంగళవారం విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా దృష్టి సారించారు. ఎమ్మెల్యేల సూచనలు, సలహాలను తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఆ శాఖ అధికారుల చేత కసరత్తు చేయిస్తున్నారు. రెండు వారాలలో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
TG: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాదముద్రలు సేకరించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మంగంపేట మండలంలోకి పెద్దపులి ప్రవేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
SDPT: దుబ్బాక పురపాలికలోని ధర్మాజీపేట ఏడవ వార్డుకు చెందిన దివిటి సరస్వతి (53) అనే మహిళ గతంలో భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. ఆమె కుమార్తెకు వివాహం చేసిన తర్వాత కుమార్తె కూడా అనారోగ్యంతో మరణించింది. దీంతో గత కొంతకాలంగా కూలి పని చేస్తూ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఒంటరిగా జీవనం కొనసాగించలేక పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ATP: న్యూఢిల్లీలో కేంద్ర ట్రైబల్ మంత్రి జువల్ ఓరంను మంగళవారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. వాల్మీకులు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు, బోయలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ELR: ఏలూరు జిల్లాలో రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 657 గ్రామాల్లో ఈ నెల 11 నుంచి జనవరి 8 వరకు జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు.
NRPT: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12 న అంగన్వాడీ సిబ్బంది చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి బలరాం కోరారు. మంగళవారం డీడబ్ల్యూవో అధికారికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడీలకు నష్టం కలిగించే జీవో 10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
CTR: కుప్పం పురపాలక సంఘం పరిధిలో గురు, శుక్ర వారాల్లో రెండు రోజులపాటు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఎంఎఫ్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పరమసముద్రంలోని కస్తూరిబా గాంధీ ప్రభుత్వ బాలికా విద్యాలయాలలో ఈ శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు.
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో బుధవారం వన దుర్గమ్మకు ఏకాదశి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తెల్లవారి నుండి ఆలయానికి తరలివస్తున్నారు. స్థానిక నది పాయలో పుణ్యస్నానం చేసి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు.
TPT: కుక్కను చంపిన ఇద్దరిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. ఈనెల 6న పెంపుడు కుక్కను చంపారంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు. కుక్క ఎదురింట్లో ఉన్న తమను చూసి అరుస్తూ ఉండడంతో సాయికుమార్, శివకుమార్ నరికి చంపినట్లు తెలిపారు.
బాపట్ల: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల టీడీపీ క్రైస్తవ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజు హాజరయ్యారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SKLM: క్షణికావేశంలో ఓ యువకుడు నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మందసకు చెందిన బెహరా రామకృష్ణ(33) సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించారు. అనంతరం గ్రామ సమీపంలో ఇటుకలు బట్టికి వెళ్లి పూరిపాకలో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. తండ్రి బెహరా శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేపడుతున్నారు.
TPT: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో అర్థ వార్షిక పరీక్షలు సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ మోడల్ పేపర్ (ఎస్ఏటీఎంపీ) టర్మ్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
TPT: ఈ నెల 13వ తేదీన ఎడ్‌సెట్ -2024 స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఎస్వీయూలోని అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్టు రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు, ఎడ్‌సెట్ ర్యాంకు కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావచ్చని వర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ బాబు కోరారు.
WLG: ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ గీసుగొండ ప్రజలు వినియోగించుకోవాలని సీఐ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజీ మార్గమే రాజా మార్గమని’ ఆవేశంలో గొడవలు పడి కేసులు పెట్టుకున్న వారు జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని రాజీ పడదగిన అన్ని సివిల్, క్రిమినల్ కేసులు ఇరువర్గాల కక్షిదారులు సత్వర పరిష్కారం పొందవచ్చని సీఐ మహేందర్ తెలిపారు.
NDL: నందికొట్కూరులో బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. లహరి(17) మృతికి అగ్నిప్రమాదమే కారణమని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. లహరి, రాఘవేంద్ర దోమల కాయిల్ పెట్టుకుని నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందన్నారు. గదిలో ఉన్న టర్పెంట్ ఆయిల్, ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు.