KMR: జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ తెలిపారు. వార్త కవరేజ్‌కి వెళ్ళినా విలేకరులపై ఆయన దాడి చేయడం సరికాదన్నారు. తక్షణమే మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
KKD: పట్టణంలోని సాంబమూర్తినగర్ గాంధీభవన్లో యువతకు కంప్యూటర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉన్నతి స్కిల్ సెంటర్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ శిక్షణ, టాలీ, టైపింగ్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, సెల్ఫ్ మార్కెటింగ్ వంటి వాటిపై 35 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.18 నుంచి 3వ బ్యాచ్ ప్రారంభం అవుతుందని, 15లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ATP: జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 1,088 పైగా కేసులు నమోదు చేసి రూ.2,29,250 జరిమానాలు వేసినట్లు తెలిపారు. అదేవిధంగా మద్యం సేవిస్తున్న 61మంది, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 16 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు.
కడప: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి మంగళవారం సరికొత్త సవాల్ విసిరారు. మా ప్రభుత్వంలో విమర్శ చేస్తే అది విమర్శ, ఇప్పుడు మీ ప్రభుత్వం విమర్శ చేస్తే ఎం ప్రయోజనం ఉండదని, ఎక్కడైనా తాను ఈ ప్రపంచంలో ఒక్క ఎకరా భూమి ఆక్రమించి ఉంటే తనని దోషిగా ప్రజాకోర్టులో నిలబెట్టాలని తెలిపారు. అలా చేస్తే జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయనన్నారు.
KNR: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలు ఆవిష్కరించాలని రాజకీయ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధికారికి వినతి పత్రం అందజేశారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు రాజకీయ జోక్యం ఉండడం చాలా బాధాకరమని అన్నారు.
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో ఐపీఓకి రానుంది. ఈ విషయాన్ని సంస్థ కో- ఫౌండర్ ఆదిత్ పాలిచా తెలిపారు. 2025లో ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్‌లోకి రావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. 2026 నాటికి అప్పులన్నీ తీరిపోయి సంస్థ లాభాల్లోకి అడుగుపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని.. రోజుకు వేల వస్తువులను 10 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తున్...
NLR: ఆనం సంజీవరెడ్డి సోమశిల హైలెవెల్ కెనాల్‌ను పూర్తిచేసి మెట్ట ప్రాంతమైన మర్రిపాడు మండలానికి సోమశిల జలాలు తీసుకురావడానికి దృఢ సంకల్పంతో పని చేస్తున్నామని మంత్రి ఆనం పేర్కొన్నారు. మంగళవారం పొంగూరు రిజర్వాయర్‌ను మంత్రి సందర్శించారు. 2026 మార్చ్ లోగా మొదటి విడత పనులను పూర్తి చేసి పడమటి నాయుడు పల్లి, పొంగూరు మొదలగు ప్రాంతాలకు సోమశిల జలాలను తరలిస్తామన్నారు.
PDPL: కోలిండియా స్థాయిలో రాణించి సింగరేణి సంస్థ పేరు నిలబెట్టాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు అన్నారు. ఆర్జీ- 3, ఏపీఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంపెనీ స్థాయి అథ్లెటిక్స్, స్విమ్మింగ్, త్రో బాల్ పోటీలను మంగళవారం రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ప్రారంభించారు.
NZB: నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గణిత శాస్త్ర రాష్ట్ర అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్షను, జిల్లా కేంద్రంలోని గంజిలోని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రతిభ పరీక్షకు విద్యర్థులు హాజరు కావాలి అన్నారు.
NLR: ఉదయగిరి నియోజకవర్గంలోని రాళ్లపాడు కుడి కాలువ గేట్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు, సిబ్బంది తూము లోపలికి వెళ్లి గేటుకు తాడు కట్టి పైకి లాగేందుకు ప్రయత్నించారు. రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో గేట్ల మరమ్మతుల నిపుణులను పిలిపించారు. కుడికాలువ నీటి ప్రవాహం లేకపోవడంతో వరి నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు అంటున్నారు.
ATP: పుట్లూరు మండలంలోని సుబ్బరాయ సాగర్ నుంచి పుట్లూరు మండల కేంద్రానికి వెళ్లే కెనాల్ కందిగోపుల-పుట్లూరు మధ్య భారీ గండి పడింది. నీరు వృధాగా జాజికొండ వాగుకు వెళ్తున్న విషయాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలుసుకొని రాత్రి 10గం సమయంలో గండిని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
NLR: ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా సేకరణ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పండ్లు, కూరగాయలు, పూలు నిల్వ చేసుకునేందుకు రాయితీ ద్వారా నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు.
KMR: జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతు పనుల నిమిత్తం మోటార్లు నిలిపివేయడం జరుగుతుందని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్, బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిదిలోని గ్రామాలకు బల్క్ నీటి సరఫరాలో రెండు రోజులు (ఈనెల 11,12 తేదిల్లో)అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని వారు కోరారు.
ATP: రాప్తాడు రైల్వేగేట్ దగ్గర ఒక తోటలో భారీగా గోవా మద్యం డంపు దొరకడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. అసలు గోవా నుంచి మద్యం ఎలా వచ్చింది. ఇక్కడ ఎవరు డంప్ చేశారో వివరాలు వెల్లడించాలని అధికారులను కోరారు.
PDPL: డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మంగళవారం పెద్దపల్లిలో నిరవధిక సమ్మెకు దిగారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ అధ్యక్షులు తిరుపతి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.