JGL: మెట్‌పల్లి పట్టణంలో మంగళవారం శాస్త్రి చౌరస్తాలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసనగా బంగ్లాదేశ్ జాతీయ పథకాలు ధ్వంసం చేయడం జరిగింది. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హిందూ జాగృతి కన్వీనర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులను ఊచకోతకు మద్దతిస్తూ హిందువులపై దాడులు చేయిస్తూ అరాచకాలు చేస్తున్నదని, మన హిందువులపై దాడికి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
KMR: మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్ గ్రామంలో రేపు అనగా గురువారం మండల మహా పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గురు స్వాములు కొండ హన్మండ్లు స్వామి, రాజు స్వామి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న ప్రసాద వితరణ, రాత్రి ఏకాదశ రుద్రాభిషేకం, భజన, మెట్ల పూజ, హరతీ కార్యక్రమం చేపడుతున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కృష్ణా: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై మంగళవారం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ ద్వారా అవగాహన కల్పించారు. పెనమలూరు మండలంలోని పలు కూడళ్లలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్లు, సీటు బెల్టులను ధరించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించినందుకు కొందరికి జరిమానాలు విధించారు.
W.G: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కిన కొణిదల నాగబాబు హైదరాబాదు నుండి విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో చోటు దక్కినందుకు నాగబాబుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం జనసైనికులు పాల్గొన్నారు.
KKD: రాష్ట్ర సీఎం చంద్రబాబును కాకినాడకు చెందిన సానా సతీష్ కలిశారు. మంగళవారం సాయంత్రం అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిసి తనకు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని సానా సతీష్ పేర్కొన్నారు.
NTR: చందర్లపాడు మండల పరిధిలోని వెలది కొత్తపాలెం గ్రామంలో రోడ్లపై కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ మార్గంలో స్కూల్ ఉండటంతో పిల్లలు సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లాలంటే ఎక్కడ దాడి చేస్తాయేమోనని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. కుక్కలు ద్విచక్ర వాహనాల వెంట పడటంతో పలు ప్రమాదాలు జరిగాయని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గచ్చిబౌలిలోని తన నివాసంలో కలసి వినతి పత్రాలు అందజేశారు. పలువురు ప్రజానిధులు, ప్రజలు కలిసి వారి సమస్యలను వివరించి పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజా ప్రభుత్వం ముందుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కడప: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నగరంలోని ప్రజలు వారి సమస్యలను శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు.
NLG: పదవితోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్. విభాగంలో 8 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించి బ్యాడ్జిలను అందించారు. క్రమశిక్షణతో బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందాలని సూచించారు.
BPT: టీడీపీ పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని గుంటూరు నగర టీడీపీ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం చుట్టగుంటలో టీడీపీ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి పేదలకు కూడు, గూడు, వస్త్రాలు వారికి కల్పించి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అయ్యారని కొనియాడారు.
VZM: గంట్యాడ పోలీసులు మంగళవారం కోడి పందాల స్దావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు.ఈ మేరకు మండలంలో చినమధుపాడలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కోడిపందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రెండు కోడిపుంజులు, వెయ్యి రూపాయల నగదు, 7 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి వారిపై పై కేసు నమోదు చేశారు.
JGL: కోరుట్ల మండలం యూసుఫ్ నగర్‌కు చెందిన నర్సాగౌడ్‌కు మంజూరైన రూ. 1.50 లక్షల విలువ గల ఎల్ఓసీ చెక్కును కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగారావు అందజేశారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో నర్సాగౌడ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
W.G: పాలకొల్లు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే నీటి సంఘం ఎన్నికల గురించి చర్చించారు. కూటమిలో అందరినీ భాగస్వాములు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర పాల్గొన్నారు.
కోనసీమ: టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంగళవారం కలిశామని అమలాపురం MP హరీష్ మధుర్ తెలిపారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్ కోసం లేఖ అందజేశామని, దివంగత నేత బాలయోగి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం ఏకాదశి: రా. 10.43 తదుపరి ద్వాదశి రేవతి: ఉ. 10-03 తదుపరి అశ్విని వర్జ్యం: తె. 4-39 నుంచి 6-08 వరకు అమృత ఘడియలు: ఉ. 7-49 నుంచి 9-18 వరకు తిరిగి రా. 1-41 నుంచి 3-10 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-31 నుంచి 12-15 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 01-30 వరకు సూర్యోదయం: ఉ. 6.24; సూర్యాస్తమయం: సా.5.23 […]