TG: మోహన్‌బాబు నివాసం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్.. చిరిగిన చొక్కాతో, గాయాలతో బయటకు వచ్చాడు. అతడి వెంట వచ్చిన ప్రైవేట్ బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించివేశారు. అయితే, తన కూతురిని చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారని మనోజ్ వాపోయాడు. మోహన్‌బాబు బౌన్సర్లు కొడుతున్నారని తెలిపాడు. కాగా, మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడికి యత్నించిన విషయ...
HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ మొదటి, రెండు, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
KNR: చెస్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన KNR చదరంగ క్రీడాకారులను పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి తన కార్యాలయంలో అభినందించారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురంలో జరిగిన 68వ జాతీయస్థాయి పాఠశాలల అండర్ 17 చెస్ పోటిల్లో సుప్రీత్ రజత పతకం సాధించగా సింగపూర్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్‌లో మేఘసంహిత కౌశ్య పథకం సాధించింది.
AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రం అభివృద్ధి చేస్తున్న 8 స్మార్ట్ సిటీలో ఒకటి రాష్ట్రానికి కేటాయించింది. వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. కొత్తగా అభివృద్ధి చేసే 8 స్మార్ట్ సిటీలకు కేంద్రం రూ.8వేల కోట్లు కేటాయించింది.
VZM: ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన అధికారులతో మోటారు ప్రమాద బీమా కేసులకు సంబంధించి ఈ నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలతోలో ఎక్కువ కేసులు పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జ్ బి.అప్పలస్వామి, ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ కే.విజయ్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
TPT: ఎర్రావారిపాళెం మండలం ఉదయ మాణిక్యం గ్రామంలో రేపు చంద్రగిరి ఎమ్మెల్యే నాని పర్యటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే రెవిన్యూ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. రైతుల సమస్యలు, భూ సమస్యలు పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల రైతులు, భూ సమస్యలు ఉన్నవారు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపింది.
MDK: మెదక్ పట్టణంలోని పిల్లి కోటలో వైద్య మెడికల్ కాలేజ్ క్యాంటీన్ హాస్టల్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
MDK: మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12లోపు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో తెలియజేయాలన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ రాజకీయ పార్టీలకు తెలిపారు.
నంద్యాల: ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాడుగులపల్లి ఎస్సై ఎస్. కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులు ఇరువర్గాలు రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. ఇతర విషయాల గురించి ఏమైనా సందేహం ఉంటే మండల స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
MDK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11వ ప్రపంచ వ్యవసాయ గణనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రణాళిక అధికారి మాకం బద్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ గణన రెండు దశల్లో ఉంటుందన్నారు. రెండవ దశలో 98 గ్రామాల్లో 64 మంది విస్తరణ అధికారులు పాల్గొంటారన్నారు. ఈ వివరాలను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు.
NLG: సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశ కార్యకర్తలను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి, ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18 వేలను అందించాలన్నారు.
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ 30 రోజుల్లో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెగా మాస్ మేనియా వచ్చేస్తుంది. థియేటర్స్‌లో కలుద్దాం అనే క్యాప్షన్ జత చేశారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
W.G: లేస్‌కు మరింత వన్నె తెచ్చేదిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు కలెక్టర్‌ను న్యూఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.విశ్వ ఆధ్వర్యంలో కలుసుకుని లేస్ ఉత్పత్తులపై చర్చించారు.
VSP: విశాఖలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణిని మంగళవారం జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గిరిజన ప్రాంత సమస్యలను మంత్రి దృష్టికి తీసువచ్చారు. గిరిజన గురుకులల్లో ఔట్‌సోర్స్‌లో పనిచేస్తున్న తమను సీఆర్టీలుగా మార్చండంటూ గత 4 వారాలుగా నిరవధిక దీక్ష చేస్తున్న వారి సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు.
HYD: ఈనెల 14న నార్సింగి పరిధి కోకాపేట్ వద్ద దొడ్డి కొమురయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను డా.బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.