• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘RRR’ స్పెషల్ స్క్రీనింగ్.. ‘వారణాసి’ వీడియో!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘RRR’ మరోసారి వార్తల్లో నిలిచింది. అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ ‘రీగల్’ మార్చి 2న ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేస్తోంది. ఈ ప్రదర్శనలో ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివీల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు రాజమౌళి బృందం హాజరయ్యే అవకాశం ఉంది.

February 22, 2026 / 12:49 PM IST

ఆ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం: భూమన

AP: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పరకామణి కేసులో మళ్లీ FIR నమోదు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలను నిందితులుగా ఇరికించేందుకే ఒక డీఎస్పీకి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారని విమర్శించారు.

February 22, 2026 / 12:48 PM IST

అవిలాలో టీడీపీ పార్లమెంట్ భవన భూమి పూజ

తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో నిర్మాణం ప్రారంభమయ్యే నూతన టీడీపీ పార్టీ పార్లమెంటు భవన భూమి పూజ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యక్రమ సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి హాజరై ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:47 PM IST

చిట్యాలలో గోటితో వడ్ల వలవడం కార్యక్రమం

BHPL: చిట్యాల మండలం వెంకట్రావుపల్లి (C) గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీరామదాసు భక్తమండలి చేల్పూర్ ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం గోటితో వడ్ల వలవడం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ తౌటం లక్ష్మి, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వయంగా గోటితో వడ్లు వలిచి తలంబ్రాలు సిద్ధం చేశారు.

February 22, 2026 / 12:46 PM IST

ఆమనగల్లులో దేవాలయ భూమి కౌలుకు వేలం

NLG: ఆమనగల్లులోని శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవాలయ భూమి బహిరంగ కౌలు వేలం రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాలయ ఇన్‌ఛార్జ్ మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి, ఛైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. దేవాలయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నిర్వాహకులు కోరారు.

February 22, 2026 / 12:45 PM IST

CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌లు అప్పగింత

MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 4 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్ ద్వారా బద్దంపల్లి, చామనపల్లి, లక్ష్మీపూర్, మొట్లగూడ గ్రామాలకు చెందిన వారి ఫోన్లను గుర్తించారు. SI జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ భరత్ సహకారంతో వీటిని యజమానులకు అప్పగించారు.

February 22, 2026 / 12:45 PM IST

ఉద్యమకారుల సంక్షేమానికి మంత్రి ప్రత్యేక కమిటీ

PDPL: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో పెద్దపల్లి ఉద్యమకారుల ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైన నాయకులు, ప్రజాప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉండటం సంతోషకరమని తెలిపారు. ఫోరం కన్వీనర్ ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:44 PM IST

సారంపల్లిలో చిన్నారుల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరం

SRCL : ​తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్ గౌడ్, మునిగేలా రాజు, వార్డ్ సభ్యులు ఖాదర్, భారతవ్వ, హనీఫ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చొరవను గ్రామస్తులు అభినందించారు.

February 22, 2026 / 12:44 PM IST

‘సీఎం-కప్’ పరుగు పందెంలో లిఖిత ప్రతిభ

NLG: ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆమనగల్లు గ్రామానికి చెందిన నలబాల లిఖిత 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి రికార్డు సృష్టించింది. 33 జిల్లాల నుంచి పాల్గొన్న పోటీదారులలో మూడవ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటింది. గ్రామీణ క్రీడాకారులకు ‘సీఎం-కప్’ గొప్ప వేదికని, తన తదుపరి లక్ష్యం జాతీయ స్థాయికి ఎంపిక కావడమేనని లిఖిత పేర్కొంది.

February 22, 2026 / 12:44 PM IST

రేపు జిల్లాలో PGRS కార్యక్రమం: కలెక్టర్

NLR: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నందు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను వెబ్ సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సమాచారం కోసం 1100 కాల్ సంప్రదించవచ్చన్నారు.

February 22, 2026 / 12:43 PM IST

అల్వాల్ TIMS ఆసుపత్రి నిర్మాణంలో పెరిగిన వేగం

MDCL: అల్వాల్ TIMS ఆసుపత్రి నిర్మాణంలో వేగం పెరిగినట్లుగా అక్కడి ఇంజనీర్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే TIMS ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చివరి దశలో వర్క్ కొనసాగుతుండగా, ఇది అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల వారికి ప్రభుత్వ వైద్యం మరింత చేరువవుతుందని స్థానిక డాక్టర్ శివప్రకాష్ వర్మ తెలిపారు.

February 22, 2026 / 12:42 PM IST

పాక్ సూపర్‌ లీగ్‌లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌

పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌ చేరాడు. ఈ లీగ్‌లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్‌కీపర్‌ రూబిన్‌ హెర్మన్‌ వీరి సరసన చేరాడు. హెర్మన్‌ను లాహోర్‌ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్‌తో జతకట్టిన అనంతరం హెర్మన్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది.

February 22, 2026 / 12:42 PM IST

కొవ్వూరి బసివిరెడ్డి జీవిత చరిత్ర ఆదర్శం: ఎమ్మెల్యే

E.G: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అపర దానకర్ణుడు కొవ్వూరి బసివిరెడ్డి జీవిత చరిత్రను ఇటీవల జరిగిన అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్బంగా అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యేను కొవ్వూరి బసివిరెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శమని ఎమ్మెల్యే కొనియాడారు.

February 22, 2026 / 12:40 PM IST

పోలింగ్ సరళిపై శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు

ATP: గత ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి శైలజానాథ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి కేవలం 30 వేల టోకెన్లు మాత్రమే జారీ అయ్యాయని పేర్కొన్నారు. మరి అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా నమోదయ్యాయని, ఆ ఓట్లు దెయ్యాలు లేదా ఆత్మలు వేశాయా అని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 12:40 PM IST

అమ్మవారి పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: మెలియాపుట్టి (M) గాథలవలస గ్రామంలో శ్రీ సవర పోలమ్మ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులు ఉంటే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అని అన్నారు.

February 22, 2026 / 12:39 PM IST