NLR: నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు దొరవారిసత్రంలో మంగళవారం పర్య టించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలపై ఆరా తీశారు. స్థానిక ఎస్ఐ అజయ్ కుమార్ , స్టేషన్ రైటర్ రామకృష్ణ, సిబ్బంది పనితీరుపై డీఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.
HYD: తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లీ పేరుతో ప్రభుత్వం తీరని అపచారం చేసిందని రాజేంద్రనగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పునకు నిరసనగా డైరీఫామ్ చౌరస్తాలో మంగళవారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు.
NLR: సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి సత్కరించారు. పక్షుల పండుగ నిర్వహణకు నిధులు మంజూరు చేయడంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోయారని తెలిపారు.
KNR: అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కేవలం సోనియా గాంధీ దృఢ నిశ్చయం వల్లే సాధ్యమయ్యిందని, రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ అమూల్యమైన పాత్రను ప్రతిబింబిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని రాసిన “మదర్ ఆఫ్ ది సాయిల్” పుస్తకాన్ని పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
కోనసీమ: ఇసుక, మట్టి, లిక్కర్ ఇవి కూటమికి మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నాయని MLA బండారు సత్యానందరావు పేర్కొన్నారు. YCP కార్యాలయంలో మంగళవారం రాత్రి MLA మాట్లాడుతూ.. అలాగే ఫ్రీ ఇసుక విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పేవి అన్ని అబద్ధాలు అని ఆయన చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి అన్నారు. సమావేశంలో ZPTC లు, MPP లు పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ 11వ డివిజన్ గౌతమి నగర్‌లో గల అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మద- నర్సన్న సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడీ పిల్లలకి స్కూల్ యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌తో పాటు, అంగన్వాడీ టీచర్లు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని 33వ డివిజన్‌లో మంగళవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచనల మేరకు నేతాజీ నగర్‌లో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను స్థానిక కార్పొరేటర్ హజరత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంచలనాయుడు, టీడీపీ నాయకులు హాజరత్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయిస్తున్నామని తెలిపారు.
W.G: కొవ్వూరు వద్ద బల్లెపాడు నుంచి ఏలూరుకు అధిక లోడుతో వెళుతున్న 2 లారీలను సీజ్ చేసినట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. మంగళవారం కొవ్వూరు సమీపంలో అధికలోడుతో వెళ్తున్న 2 లారీల రికార్డులు పరిశీలించారు. ఈ మేరకు నిర్దేశించిన పరిమాణం కంటే 10 మెట్రిక్ టన్నులు అధిక లోడు చేసి ఏలూరు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. లారీ యజమానులపై కేసు నమోదు చేయమన్నారు.
KNR: రూరల్ మండలం చెర్ల బూత్కూరు గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదని రైతు సంఘం నాయకులు కూర అమరేందర్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పెండ్యాల శ్యాం సుందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా వారు రుణమాఫీ మంజూరు కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌కు వినతి పత్రం ఇచ్చారు.
యువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. టీకాలు వేయడం వల్లే అటువంటి మరణాలు తగ్గుతాయని అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. మొత్తం 729 ఆకస్మిక మరణాలు, 2,916 కేసులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకోవడం వల్ల ఆకస్మిక మరణాల సంఖ్య తగ్గినట్లు వెల్లడైనట్లు పేర్కొన్నారు.
SKLM: జిల్లా జూనియర్స్ M/F జట్ల ఎంపికలు ఈనెల 15 వ తేదీన జరగనున్నాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ శ్రీకాకుళం చైర్మన్,MLA శంకర్ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎంపికలు కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వేదికగా ఆదివారం ఉ. 9 గంటల నుంచి మొదలవుతాయన్నారు. మరిన్ని వివరాలకు పీడీ సాదు శ్రీనివాస్ (9441914214)ను సంప్రదించాలన్నారు.
VZM: గిరిజన గురుకుల అవుట్‌సోర్సింగ్ ఉపాద్యాయులు పార్వతీపురం ITDA కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న దీక్షలో మంగళవారం ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ పాల్గొని వారికి మద్దతుగా మాట్లాడుతూ బెదిరింపులు ఆపి సమస్యలు పరిస్కారం చేయాలని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇతర ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేయడం మానుకోవాలని హితవు పలికారు.
GNTR: గత ఐదు సంవత్సరాలలో గ్రామ అభివృద్ధికి పాటుపడిన వారిపై నేడు అవినీతి పేరుతో ఆరోపణలు చేస్తూ గ్రామంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకుడు కల్లూరి నాగేశ్వరరావు అన్నారు. పెదనందిపాడు మండలం అన్నపర్రులో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, తాను తప్పు చేస్తుంటే ప్రభుత్వ ఎటువంటి చర్యలు ఉంటానన్నారు.
W.G: అరుణాచల గిరి ప్రదక్షిణకు ఈ నెల 13వ తేదీన తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు బయల్దేరుతుందని డిపో మేనేజర్ వై. సత్యనారాయణమూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం ఆలయాలను దర్శించి 15వ తేదీన ఉదయం 2 గంటలకు అరుణాచలం చేరుతుందన్నారు. తిరిగి 16వ తేదీన తాడేపల్లిగూడెం చేరుతుందన్నారు.
కృష్ణా: మండలంలోని వెల్వడం గ్రామాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఆదర్శ సౌరగ్రామంగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. PM సూర్యఘర్ పథకం అమలులో భాగంగా వెల్వడంలో ఆదర్శ సౌరగ్రామాల కాంపోనెంట్ అమలు జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామంలో పునరుత్పాదక ఇంధన వినియోగం పెంచేలా పలు కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.