• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘LRS దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి’

NRML: LRS కింద వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో LRS దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.

December 10, 2024 / 06:43 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ధూళిపాళ్ల

GNTR: పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరిశీలించారు. పంట పండించిన రైతు దగ్గర గిట్టుబాటు ధర వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆరుదల లక్ష్మయ్య అనే రైతుకు ధాన్యం కొనుగోలు కూపన్‌ను అందజేశారు.

December 10, 2024 / 06:43 PM IST

జిల్లా కలెక్టర్‌ను కలిసిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్

MDK: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం మెదక్ జిల్లా కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఏ విటల్, సెక్రెటరీ నాగభూషణం, ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును, అదనపు కలెక్టర్ నగేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

December 10, 2024 / 06:43 PM IST

కేటీఆర్, కవితలకు కుక్క కూడా ఓటు వేయదు: అర్వింద్

TG: తాను ఎప్పుడూ ఫైర్ బ్రాండేనని ఎంపీ అర్వింద్ అన్నారు. తన బండి గేర్ తన చేతిలోనే ఉందని సమయాన్ని బట్టి గేర్, స్పీడ్ మారుతుందని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో పిచ్చి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్, కవితలకు కుక్క కూడా ఓటు వేయదన్నారు. కేటీఆర్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని స్పష్టం చేశారు.

December 10, 2024 / 06:42 PM IST

రాయలసీమలో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తాం: మంత్రి పయ్యావుల కేశవ్

KNL: రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నంద్యాల కలెక్టరేట్లోని సెంచునరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వల్లే డామేజ్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో ఏపీని గాడిన పెట్టామన్నారు.

December 10, 2024 / 06:42 PM IST

ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో మానవహక్కుల దినోత్సవం

CTR: ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తుడా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ.. హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐ మధుసూదన్ హక్కుల పరిరక్షణపై వివరించారు. విద్యార్థులు చైతన్యవంతం కావాలని సూచించారు. ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, హెచ్‌వోడీ నీరజా పాల్గొన్నారు.

December 10, 2024 / 06:42 PM IST

‘బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లాకు చేసిందేమీ లేదు’

MDK: మెదక్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమని లేదన్నారు. కనీసం మహిళా ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారని మండిపడ్డారు.

December 10, 2024 / 06:41 PM IST

రైల్వే సమస్యలపై కేంద్రమంత్రితో ఎంపీ భేటీ

NLR: జిల్లాలో రైల్వే పరంగా ఉన్న పలు సమస్యలను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వని వైష్ణవ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఎంపీ వేమిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. టెండరింగ్ మొదలైన వాటికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

December 10, 2024 / 06:39 PM IST

పౌష్టిక ఆహారం పై ప్రత్యేక దృష్టి సారించాలి

SKLM: వసతి గృహాలు పరిశుభ్రత, పౌష్టిక ఆహారం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయశాఖ సంస్థ, కార్యదర్శి, ఆర్.సన్యాసి నాయుడు అన్నారు. మంగళవారం రణస్థలంలో గల గవర్నమెంట్ కళాశాల నందు బిసి హాస్టల్‌ను సందర్శించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు ఆహార సదుపాయాలు గురించి ఆరా తీస్తూ తగు సూచనలు ఇస్తూ పిల్లల పట్ల శ్రద్ధ చూపాలని తెలిపారు.

December 10, 2024 / 06:39 PM IST

మంచినీటిని అందజేయాలని ఆందోళన

GNTR: తమకు మంచినీటిని అందజేయాలని ప్రత్తిపాడు జగనన్న కాలనీ వాసులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాలనీకి గత వారం రోజులు నుండి మంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఖాళీ బిందెలు చూపిస్తూ నిరసన తెలిపారు. ఈ సమస్యపై గతంలో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కోరారు.

December 10, 2024 / 06:36 PM IST

టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన హరీశ్‌రావు

AP: సిద్దిపేట కోమటిచెరువు ప్రాంతంలో తిరుపతి వెంకటేశుడు  కొలువుదీరనున్నాడు. తిరుపతి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో టీటీడీ వెంకన్న ఆలయం ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే టీటీడీ పాలకమండలి సమావేశంలో దీనిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

December 10, 2024 / 06:36 PM IST

నాగారంలో సీఎం కప్ ఆటల పోటీలు ప్రారంభం

HYD: స్కూల్ గ్రౌండ్‌లో మంగళవారం సీఎం కప్ ఆటల పోటీలను నాగారం మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ప్రారంభించారు. మెరుగైన జీవితానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు. వైస్ ఛైర్మన్ మల్లేశ్ యాదవ్,మున్సిపల్ కమిషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్,ఎం.వెంకట్ రెడ్డి,పంగ హరిబాబు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

December 10, 2024 / 06:36 PM IST

సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు

కృష్ణా: సీసీ కెమెరాలతో నేరస్తులను పట్టుకోవచ్చని కైకలూరు రూరల్‌ సీఐ రవికుమార్ పేర్కొన్నారు. మండవల్లిలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మంగళవారం గ్రామ పెద్దలు, వ్యాపారులతో సీఐ సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. 500 మంది ప్రజలకు ఒక పోలీసు ఉంటే కంట్రోలు చేయగలరని, మన వ్యవస్థలో 5 వేల మందికి ఒక పోలీసు లేరని పేర్కొన్నారు.

December 10, 2024 / 06:35 PM IST

గ్రూప్ 2 పరీక్షకు 8080 మంది అభ్యర్థులు

NRML: ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 8080 మంది అభ్యర్థి పరీక్షకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సమావేశంలో అధికారులతో వారు మాట్లాడుతూ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

December 10, 2024 / 06:33 PM IST

పట్టణంలో స్కానింగ్ సెంటర్ల తనిఖీ

SRCL: పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను మంగళవారం తనిఖీ చేసినట్టు జిల్లా డిప్యూటీ ఉప వైద్యాధికారి అంజలి తెలిపారు. పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి రికార్డు స్కానింగ్ మిషన్లను పర్యవేక్షించినట్టు ఆమె పేర్కొన్నారు. గర్భస్థ పూర్వపిండ స్కానింగ్ పరీక్షలు, రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆధ్వర్యంలో నిబంధనలను అనుసరించి చేయాలని ఆదేశించారు.

December 10, 2024 / 06:33 PM IST