• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కూలి పోయేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం

W.G: పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక విద్యుత్ స్తంభం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. నరసాపురం నిడదవోలు రోడ్డులో నిత్యం వాహనాలు తిరిగే ప్రదేశంలో ఇలా ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభం ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

December 10, 2024 / 06:33 PM IST

ఈవీఎం కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ప్రావీణ్య

WGL: వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఆవరణలో ఉన్న ఈవీఎం కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఈవీఎంలను పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డిఓ రాథోడ్ రమేష్, కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

December 10, 2024 / 06:32 PM IST

మంచు ఫ్యామిలీకి నరఘోష: నట్టి కుమార్

మంచు ఫ్యామిలీలో గొడవలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పందించాడు. మొహన్ బాబు ముక్కుసూటి మనిషని, ఇండస్ట్రీలో అతను ఓ టైగర్ అని పేర్కొన్నాడు. మంచు కుటుంబానికి చాలా మంచి పేరు ఉందన్నారు. అలాంటి ఫ్యామిలీలో గొడవలు జరగడం దురదృష్టకరమన్నారు. వారికి ఏదో నగఘోష తగిలినట్లుందని, మోహన్ బాబు తప్ప వారి వివాదాన్ని ఎవరూ పరిష్కరించలేరన్నారు.

December 10, 2024 / 06:30 PM IST

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: సీపీ

SDPT: ఈనెల 14న జరుగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ కోరారు. రాజీమార్గమే రాజమార్గమని, సమయాన్ని డబ్బులను ఆదాచేసుకోవాలన్నారు. కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు.

December 10, 2024 / 06:30 PM IST

రైల్వేకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

ELR: ఏలూరు పార్లమెంటు పరిధిలో రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దిల్లీ రైల్ భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశం సందర్భంగా ఎంపీ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

December 10, 2024 / 06:30 PM IST

పండుగ సాయన్న పోరాట పటిమ ఆదర్శం

HYD: స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కోసం పెత్తందారీ వ్యవస్థపై రాజీలేని పోరాటం చేసిన పండుగ సాయన్న పోరాట పటిమ భావితరాలకు ఆదర్శమని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ కార్యదర్శి దోమ మోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం తలకొండపల్లిలో పండుగ సాయన్న వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

December 10, 2024 / 06:29 PM IST

మాజీ సీఎం KCRను కలిసిన అంబర్‌పేట్ MLA

HYD: అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన నివాసంలో సతీసమేతంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాలేరు వెంకటేశ్ శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని దీవించారని ఎమ్మెల్యే తెలిపారు.

December 10, 2024 / 06:26 PM IST

రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్పీకర్ క్లాసులు

HYD: రేపటి నుంచి రెండు రోజుల పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. MHRD లోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఈ శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల విధివిధానాలను, సభ జరిగే తీరు, సభా మర్యాద, ప్రత్యేకత గురించి వివరించే అవకాశం ఉంది.

December 10, 2024 / 06:26 PM IST

ఉత్తమ మరుగుదొడ్లకు పురస్కారాలు అందజేసిన కలెక్టర్

కర్నూలు:  ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం క్యాంపెయిన్‌లో ఉత్తమ మరుగుదొడ్లు నిర్వహించిన వారికి కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పురస్కారాలు అందజేశారు. కర్నూలులో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించి, హమారా శౌచాలయ్-హమారా సమ్మాన్‌లో భాగంగా వినియోగంలో లేని టాయిలెట్లను గుర్తించి వినియోగంలోకి తెచ్చేలా అవగాహన కలిగించడం, నిర్వహణపై చైతన్యం జరిగిందన్నారు.

December 10, 2024 / 06:24 PM IST

ట్రైకార్‌కు పూర్వ వైభం తెస్తాం

ASR: ప్రభుత్వ పథకాలను గిరిజన పేదలకు అందించి ట్రైకార్‌కు పూర్వ వైభవం తెస్తామని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన పాడేరు ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజన యువతకు బొలేరో, ఇన్నోవా, స్విప్ట్ వాహనాలకు రుణాలు అందిస్తామని చెప్పారు.

December 10, 2024 / 06:23 PM IST

ఏడాది ప్రభుత్వ పాలనపై రౌండ్ టేబుల్ సమావేశం

HYD: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ఆధ్వర్యంలో మంగళవారం దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్‌లో ‘ప్రజల ఆకాంక్షలు ఏడాది ప్రభుత్వ పాలన’ అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. TUWJ రాష్ట్ర అధ్యక్షుడు కే.విరహత్ అలీ మోటివేటర్‌గా వ్యవహరించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో OU జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పద్మ షాతో పాటు మేధావులు పాల్గొన్నారు.

December 10, 2024 / 06:22 PM IST

‘సీపీఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి’

PLD: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మంగళవారం వినుకొండలోని శివయ్య భవన్లో జరిగిన సమావేశంలో మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ.. డిశంబరు 26 సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించాలని కోరారు.

December 10, 2024 / 06:22 PM IST

టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది: మాజీ మంత్రి

E.G: టీడీపీలో బీసీలకు నిజంగా ఆన్యాయం జరుగుతుందని, బీసీ కులాల గొంతు నొక్కిన చంద్రబాబు చరిత్రలో బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సీట్లు కేటాయింపులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయమన్నారు.

December 10, 2024 / 06:19 PM IST

‘పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి’

కామారెడ్డి: మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని TPTF రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. నేడు జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో TPTF కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపుగా 9నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి అన్నారు.

December 10, 2024 / 06:19 PM IST

గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం

NRPT: గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోస్గి మండలం గుండుమాలకు చెందిన ఫయాజ్ అలీ మేకల మందపై రోజు రాత్రి గుండుమాల్- పగిడిమాల్ ప్రాంతంలో చిరుత దాడి చేసి, ఓమేకను ఎత్తుకెళ్లి సమీపంలోనే చంపేసింది. గ్రామస్థులు FSO, FRO లక్ష్మణ్ నాయక్‌కు సమాచారం ఇవ్వంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి దాడి చేసింది చిరుతే అని నిర్ధారించారు.

December 10, 2024 / 06:19 PM IST