• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలి: రఘువీర్

NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాలను మార్చడం కాదని.. ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని బీజీపీ జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండు అడుగులు వెనక్కి వేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

December 10, 2024 / 05:59 PM IST

ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం

BHNG: ప్రగతిశీల యువజన సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు సాధన శ్రీకాంత్ అధ్యక్షతన భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు సాగర్ హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు ఎండమావిగా మారాయని అన్నారు.

December 10, 2024 / 05:57 PM IST

గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

NRML: గ్రూప్ 2 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై ఆమె అధికారులతో సమావేశం  నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్-2 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

December 10, 2024 / 05:56 PM IST

ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్

VZM: ఈ నెల 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి యొక్క ఆదేశాలు మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్ ఉమ్మడి జిల్లాలో వున్నా న్యాయమూర్తులు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీ పడదగిన కేసులకు శాశ్వత పరిస్కారం చేయాలన్నారు.

December 10, 2024 / 05:55 PM IST

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్

NLG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల12వ తేదీలోపు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు రాజకీయ పార్టీలకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని నేడు మినీ మీటింగ్ హాల్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించారు.

December 10, 2024 / 05:55 PM IST

‘సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి’

JGL: ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెట్ పెల్లి సీఐ నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో పోలీస్ కళాబృందంచే మూఢనమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, గల్ఫ్ ఏజెంట్‌ల మోసాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై మంగళవారం అవగాహన కల్పించారు.

December 10, 2024 / 05:54 PM IST

ట్విట్టర్‌లో సాయం కోరిన కోడుమూరు వాసి.. స్పందించిన లోకేశ్

కర్నూలు: కోడుమూరు టీడీపీ కార్యకర్తకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. ITDP మండల అధ్యక్షుడైన రవిశంకర్ తన పండంటి కుమారుడికి శ్వాసకోస ఇబ్బంది ఉండటంతో విజయవాడ AIIMSలో చేర్పించారు. చికిత్సకి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోందని, సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా లోకేశ్‌ను కోరారు. స్పందించిన ఆయన ‘నా టీమ్ మీతో మాట్లాడి అవసరమైన సాయం చేస్తుంది’ అని హామీ ఇచ్చరు.

December 10, 2024 / 05:54 PM IST

విద్యార్థులకు ALERT

డిస్టెన్స్, ఆన్‌లైన్‌లో హైయిర్ ఎడ్యుకేషన్‌లో కోర్సులను చదువుతున్న విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రమత్తం చేసింది. ఈ కోర్సులకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని తెలిపింది. కోర్సులకు సంబంధించిన అప్‌డేట్స్ కేవలం అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఇస్తామని సూచించింది. UGC వెబ్‌సైట్ ugc.gov.inలో వచ్చే నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని...

December 10, 2024 / 05:54 PM IST

ఇండియన్ సినిమాలో పుష్ప-2 ఆల్ టైం రికార్డ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 దేశ సినిమా చరిత్రలో రికార్డులు నెలకొల్పుతోంది. ఐదు రోజుల్లోనే 922 కోట్లు వసూల్ చేసిన తొలి ఇండియా సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.

December 10, 2024 / 05:51 PM IST

‘హక్కులను కల్పించడమే కాదు.. రక్షణ కల్పించాలి’

NLG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులను కల్పించడమే కాదు.. మహిళలకు, యువతులకు రక్షణ కల్పించాలని ఐద్వా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవహారాన్ని నిర్వహించి, హక్కుల పట్ల వారికి అవగాహన కల్పించారు.

December 10, 2024 / 05:50 PM IST

వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు: జిన్‌పింగ్

చైనా వస్తువులపై సుంకాలు విధిస్తానంటూ అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక యుద్ధాల్లో విజేతలు ఉండరని వ్యాఖ్యానించారు. తమ ప్రయోజనాలను కాపాడుకుంటామని వెల్లడించారు. బహిరంగ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

December 10, 2024 / 05:49 PM IST

పీయూలో పండుగ సాయన్న పుస్తకం ఆవిష్కరణ

MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో బెక్కం జనార్ధన్ రచించిన పండుగల సాయన్న పుస్తకం మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీయూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప, పీజీ కళాశాల ప్రిన్సిపల్ చంద్ర కిరణ్, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

December 10, 2024 / 05:49 PM IST

అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలి: ఎస్పీ

BHPL: నూతనంగా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన ఉద్యోగులు అంకితభావంతో నిజాయతీగా విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. 9 శిక్షణను పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చిన పోలీసు కానిస్టేబుళ్లతో ఎస్పీ సమావేశమయ్యారు. నిత్యం ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం అని, ప్రతికూల పరిస్థితులలో కూడా ఉద్యోగం చేయవలసి ఉంటుందన్నారు.

December 10, 2024 / 05:49 PM IST

సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

MDK: సీఎం సహా నిధి పేదలకు వరం అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూర మండలం కొడిప్యాక గ్రామానికి చెందిన మల్లారెడ్డికి రూ. 60వేల సీఎం సహాయ నిధి చెక్కును మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో హత్నూర మాజీ ఎంపీపీ వావిలాల నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు కొన్యాల నరసింహా రెడ్డి, ఆగమయ్య, బాబు యాదవ్, సురేష్ గౌడ్, పూల అర్జున్ పాల్గొన్నారు.

December 10, 2024 / 05:49 PM IST

కొమ్మాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఎమ్మెల్యే సామేలు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పాఠశాల పరిసరాలను, రికార్డులను పరిశీలించారు.

December 10, 2024 / 05:48 PM IST