TG: ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్ పనులపై దిశానిర్దేశం చేశారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన దేవాదుల నుంచి సుమారు 469 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆరున్నర లక్షల ఎకరాకలకు నీరు అందించవచ్చు.
తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లడుతూ.. క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని కలెక్టర్ తెలిపారు.
AP: సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరదిత్య, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోస్టల్ సదస్సు చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రామీణ డాక్ సేవక్‌లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.
NDL: తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ తప్పుచేసి మళ్లీ బుకాయిస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న వైసీపీని హిందూ వ్యతిరేక పార్టీగా ఆయన అభివర్ణించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గౌరు వెంకటరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొన్నారు.
RR: తుర్కయంజాల్‌లో ఆదివారం జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తుర్కయంజాల్, ఆదిభట్ల సర్కిల్ మహిళా నాయకురాళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకురాళ్లు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే కేవలం విద్య మాత్రమే సరిపోదని ఆర్థిక స్వయం ప్రతిపత్తికూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. మార్చి 1న మహిళా సమాఖ్య నిర్మాణ మహాసభను విజయవంతం చేయాలన్నారు.
WGL: పర్వతగిరి మండలం బూరుగుమళ్ళ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాము.
TG: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దేవాదుల బ్యారేజ్‌ను రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలిస్తున్నారు. సీఎం పర్యటనలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్‌పై దాడులు చేసి సుమారు 513 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ట్రామాడోల్, నైట్రోజెప్, ఆల్ఫాజోలం వంటి నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
BHPL: కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడి తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని TRP భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం BHPL జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కులం పేరుతో దేవుడి దర్శనానికి వెళ్లిన వారిపై హింసాత్మక దాడి చేయడం అమానుషమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదివారం పర్యటించారు. సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పాత మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. పాత మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని ఆధునికరించి ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు.
ATP: గుత్తిలో ఆదివారం ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శ్రీనివాసులనే ఖాతాదారుడు ఇంటి రుణాల్లో గోల్ మాల్ జరిగిందని, మార్కెట్ విలువ కంటే తక్కువకు గృహాల వేలం వేశారంటూ టౌన్ బ్యాంక్ ఛైర్మన్, అబ్దుల్ జిలాన్‌తో మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. సమస్య పరిష్కరిస్తామని తెలపడంతో ఖాతాదారుడు శాంతించాడు.
సత్యసాయి: పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పరిస్థితిపై ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో పెనుకొండ డీఎస్పీ, సీఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
MBNR: నంచర్ల గురుకుల పాఠశాలలో టీజీ సెట్-2026 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. 5 నుంచి 9వ తరగతుల ప్రవేశాల కోసం 513 మంది నమోదు చేసుకోగా, 488 మంది విద్యార్థులు హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. పోలీసు భద్రతతో పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా జరిగాయని ప్రిన్సిపల్ రమ తెలిపారు.
TG: CM రేవంత్‌రెడ్డికి BJP భయం పట్టుకుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో BJPకి ఛైర్మన్ పదవి రాకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రజాహక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. BJP పిలుపునిచ్చిన చలో కామారెడ్డి నేపథ్యంలో రామచందర్ రావును అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను విడుదల చేశారు.
KDP: VN పల్లె (M) తలపనూరులోని గంగమ్మ తల్లి ఆలయ 33వ వార్షికోత్సవం ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయము అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం అమ్మవారికి గ్రామ మహిళలచే బోనాల సమర్పణ ఉంటుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.