WGL: కలర్ ఫోటో ఫేం హీరో సుహాస్, హీరోయిన్ మాళవిక ఖిలా వరంగల్లో ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా షూటింగ్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా మూవీ ప్రొడక్షన్ మేనేజర్ డాక్టర్ మేడారపు సుధాకర్ మాట్లాడారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు షూటింగ్ ఉంటుందని, ఈ సినిమాలో లోకల్ ఆర్టిస్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
WGL: ఈ నెల 14న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ప్రచార పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ ఆవిష్కరించారు. ఇరువర్గాల కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగపరుచుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సీపీ తెలిపారు.
కామారెడ్డి: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రకటించిన హామీలు అమలు చేయాలని బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం సభ్యులు మంగళవారం డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు గంగాధర్, సాయిబాబా ఉన్నారు.
NRML: తండ్రిని చంపిన కొడుకును అరెస్టు చేసిన ఘటన మంగళవారం నిర్మల్‌లో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరాల మేరకు శనివారం నిర్మల్ మండలం మూటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం మణిదీప్ తన తండ్రిని గొంతు నులిమి చంపివేయగా, మృతుడి సోదరుడు రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గ్రామీణ సీఐ రామకృష్ణ నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసినట్టు తెలిపారు.
ATP: నగరంలోని స్థానిక లోకదాలత్ హాల్ నందు మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ శివ ప్రసాద్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు అధికారులకు అనుసరించవలసిన న్యాయపరమైన విధానాల గురించి వివరించారు.
బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో స్టన్నింగ్ లుక్స్‌తో చేసిన ఫొటో షూట్‌ను షేర్ చేసింది. దీనికి పుష్ టు స్టార్ట్ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే జాన్వీ పోస్ట్‌కు సీతారామం ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ రిప్లే ఇస్తూ ఫైర్ ఎమోజీని పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటో షూట్ తెగ వైరల్ అవుతోంది.
MNCL: యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సుదమల్ల ఆశిష ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖకు, తనకు ఓటు వేసిన యువతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఆశిష 4062 ఓట్లు సాధించింది.
VZM: నేరాలను నియంత్రించుటలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ సందర్బంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై 459, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 179 కేసులు నమోదు చేశామని తెలిపారు. అర్ధ రాత్రుళ్ళు సహేతుకరమైన కారణాలు లేకుండా తిరిగిన వారిపై 254 కేసులు నమోదు చేసామన్నారు.
AP: మంత్రి పయ్యావుల కేశవ్ నంద్యాలలో పర్యటించారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం చంద్రబాబు బ్రాండ్ కనపడుతోందన్నారు. జగన్ డ్యామేజ్ చేసిన ఏపీని గాడిలో పెట్టామన్నారు. నంద్యాల జిల్లాలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు.
KDP: రెవిన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తుందని బద్వేల్ టీడీపీ నియోజకవర్గపు సమన్వయకర్త రితిష్ రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నాయపల్లి గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామం పరిధిలోని వివిధ రెవెన్యూ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు.
NLR: అల్లూరు మండలంలోని సింగపేట గ్రామంలో మంగళవారం రెవిన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెవెన్యూ సదస్సులో రైతుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. సర్వే సంబంధిత సమస్యలు అనగా 1B, అడంగల్‌లో పేర్లు మార్పులు, పొలం సరిహద్దు సమస్యలు తదితర సమస్యలు ఈ సమావేశంలో అధికారుల దృష్టికి వచ్చాయి. దాదాపుగా మొత్తం 75 అర్జీలను స్వీకరించారు.
SKLM: రైతు సమస్యలు పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిపేట గ్రామంలో ఎమ్మార్వో రాంబాబు ఆదేశాలు మేరకు రెవెన్యూ సదస్సు నిర్వహించమన్నారు. రైతుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GNTR: ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులుకు ఉపాధ్యాయులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. టీచర్లపై యాప్‌ల భారాన్ని తగ్గించాలన్నారు. పని వేళల పెంపు సరికాదన్నారు. మండల విద్యాశాఖ అధికారులు సెలవు సైతం ఇవ్వడం లేదని తెలిపారు
BPT: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ దిశగా ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. భట్టిప్రోలు ఆర్యవైశ్య కల్యాణ మండపం నందు మంగళవారం మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీఎం ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.
ELR: ఏలూరు సత్రంపాడులోని జూనియర్ కళాశాల నందు మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ.. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం స్థాపించబడిందన్నారు. మానవ అభివృద్ధికి ఈ చట్టం ఒక మైలురాయ వంటిదని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ప్రధానమన్నారు.