అనకాపల్లి జిల్లాలో 34 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 140 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 5,420 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా.. 5,280 హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీకు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ASR: రంపచోడవరం మండలంలో పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు రంపచోడవరం ఎంపీపీ పాఠశాల ఆవరణలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ అటుగా వెళుతున్న వారిని గాయపరుస్తుంది. శనివారం మధ్యాహ్నం వరకు ఐదుగురు గాయపడి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రాగ వైద్యులు ట్రీట్మెంట్ అందించారు.
TG: పార్టీ ఫిరాయింపు విషయంలో MLA కడియం శ్రీహరిపై BRS ఎమ్మెల్యే వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను కాంగ్రెస్‍లో చేరినట్టు వచ్చిన వీడియోలు, ఫొటోలు AI అని కడియం అంటున్నారు. సిగ్గులేకుండా ఇంకా BRSలోనే ఉన్నట్లు వాదిస్తున్నారు. రాహుల్ గాంధీతో దిగిన ఫొటోలు కూడా AI ఫోటోలేనని చెప్పారు. రాజకీయంగా కడియం సమాధి కాక తప్పదు’ అని హెచ్చరించారు.
AP: కాాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవదహనం అయ్యారు. అయితే, ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా మారింది.
ఏలూరు 17వ డివిజన్ గాంధీ మైదాన ప్రాంతంలో శనివారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 2,57,658 మందికి రూ. 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేసామన్నారు. ఇందుకు జిల్లాలో 5047 మందిని నియమించినట్లు తెలపారు.
CTR: బయో-మెడికల్ వ్యర్థాలతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి జరిగే ప్రమాదాలను తగ్గించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యర్థాల నిర్వహణపై జిల్లా మానిటరింగ్ కమిటీ నిర్వహించారు. డీఆర్‌వో మోహన్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తన వ్యక్తిగత జీవితం గురించి నటి అమలా పాల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. జగత్ దేశాయ్‌తో డేటింగ్ ప్రారంభించిన నెల రోజులకే తాను గర్భం దాల్చినట్లు తెలిపింది. ఆ తర్వాతే 2023 నవంబర్ 5న తమ వివాహం జరిగిందని, 2024 జూన్ 11న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
ASF: బెజ్జూర్‌లో తపాళా శాఖ సేవలపై అవగాహన కల్పించే బ్రోచర్లను సర్పంచ్ సరోజనతో కలిసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నితిన్ శనివారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఉత్తరాల పంపిణీతో పాటు స్పీడ్ పోస్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, సుకన్య సమృద్ధి యోజన, పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్సిబిషన్ వేడుకలను మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రమ-నాగేశ్వర్ రావు శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు తయారుచేసిన వివిధ ప్రయోగాలను వీక్షించి అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ 8వ వార్డులో మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్ శ్రీలక్ష్మి సైదులు, శనివారం కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. వార్డులోని సమస్యలను ఆ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ వివరించగా.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఎర్పుల పరమేష్, సందీప రాంరెడ్డి పాల్గొన్నారు.
చాలామంది మహిళలు ఇంటి పనులు, ఆఫీస్ వర్క్ వల్లే నీరసపడుతున్నామని అనుకుంటారు. కానీ, దీనికి ప్రధాన కారణం శరీరంలో ఐరన్ లోపం కావచ్చు. ఇది దీర్ఘకాలంలో రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి కేవలం కడుపు నిండా తినడమే కాదు, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. నిరంతరం అలసటగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి.
అన్నమయ్య: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం తెలంగాణతో చీకటి ఒప్పందం చేసుకొని ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కడపలో రేపు జరగబోవు ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు.
HNK: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
BDK: భద్రాచలం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఆదివారం పర్యటించనున్నారు. చర్లలో ఆసుపత్రి శంకుస్థాపనతో పాటు, పలు మండలాల్లో సర్పంచుల సన్మానం కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం భద్రాచలంలో నవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఛైర్మన్ సారంగపాణి అన్నారు. వర్ధన్నపేట 2, 7వ వార్డులో ఛైర్మన్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డును అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఛైర్మన్ తెలిపారు.