విశాఖ: నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు పలు స్వచ్చంధ సంస్థల్లో ఉంటున్న బాల బాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి ప్రత్యేక పాస్‌లు ఏర్పాటు చేశారు. 11 ఆర్గనైజేషన్ల నుంచి సుమారు 300 మంది బాలికలకు పాస్‌లు ఏర్పాటు చేసి వారితో కలిసి సీపీ మ్యాచ్ వీక్షించారు. ఈ అవకాశం కల్పించిన సీపీతో పిల్లలు ఫొటోలు దిగారు.
విశాఖ: కోడిగుడ్డు మాజీ మంత్రి అంటూ YCP నేత గుడివాడ అమర్నాథ్‌ను ఉద్దేశిస్తూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. నిన్నటి విశాఖ పర్యటలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. YCP హయాంలో ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలు తమ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో తెచ్చామన్నారు. ఈ విషయం ఆ మాజీ మంత్రిని కూడా అడగండి అని విలేకరులతో అన్నారు.
ATP: గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ చిన్నపాటి విషయానికి మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఆనంద్ అనే రౌడి షీటర్‌పై సలీం అనే వ్యక్తి బండరాయితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
PLD: టిడ్కో గృహ సముదాయాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగటానికి వీలులేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చిలకలూరిసపేటలో ఉచిత తాగునీటి ప్లాంటును ఎమ్మెల్యే, ఎంపీ లావు కృష్ణదేవరాయలుతో కలిసి ఆయన ప్రారంభించారు. 5,520 ఇళ్లల్లో నివాసముండే వారికి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల అందుబాటులోకి తెస్తామన్నారు.
KMR: పోచారం ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం వరద తగ్గుముఖంపట్టింది. ప్రాజెక్టులోకి కేవలం 832 క్యూసెక్కుల వరద వచ్చిందని ప్రాజెక్టు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదలో 742 క్యూసెక్కులు వరద నిజాంసాగర్లోకి పోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 25.805 టీఎంసీల వరద ప్రాజెక్టు నుంచి మంజీరా ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్లిందన్నారు.
PDPL: మంథనిలో RSS శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ విభాగ్ సహ వ్యవస్థ ప్రముఖ్ మాట్లాడుతూ.. RSS 100 ఏళ్లుగా శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. అనంతరం మంథని పట్టణంలో గాంధీ చౌక్ నుంచి పలు దేవాలయాలు, అంబేద్కర్ చౌక్ మీదుగా పథ సంచలన్ నిర్వహించారు.
ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఇన్‌ఛార్జ్ జాన్సన్ నాయక్‌కు కీలక బాధ్య తలు అప్పగించింది. నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్‌కు వీరిద్దరినీ పలు బూత్‌లకు ఇన్‌ఛార్జీలుగా నియమించింది.
చిత్తూరు: DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇవాళ వారికి కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు DEO వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. నూతన ఉపాధ్యాయులు 11 రోజుల శిక్షణ పూర్తిచేసుకున్నారు. SGTలకు మ్యానువల్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.
KRNL: కర్నూలు నగరంలోని కలెక్టరేట్‌లో అక్టోబర్ 13న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి రద్దు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలోని మంచినీటి సంపులోకి జారిపడి ఒకరు మృతి చెందారు. మండలంలోని చెరుకుంపాలెంకు చెందిన సీతారాం శ్రీనివాస్ (30) నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సంపులో జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
NGL: నల్గొండ హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు ఆదివారం భక్తుల సందడితో మరింత శోభాయమానమయ్యాయి. సెలవు దినం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా నల్గొండకు పట్టణానికి పోటెత్తారు. దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పరిసరాల్లో ఏర్పాటు చేసిన మేళా దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి.
MHBD: జిల్లా కేంద్రంలోని బెస్త బజార్లోని కృష్ణ కాలనీలో ఆదివారం రాత్రి అంగన్వాడీ టీచర్ బానోత్ మాధవి (42) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకొని కనిపించడంతో, స్థానికుల సమాచారం మేరకు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి అక్కడికి చేరుకొని ఆమె కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ATP: ప్లేస్మెంట్ ఆర్డర్లు పొందిన కొత్త టీచర్లు సోమవారం కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ కావాలని డీఈవో ప్రసాద్ బాబు ఆదివారం ప్రకటనలో తెలిపారు. వారు విధుల్లో చేరిన తర్వాత బదిలీ అయినా రిలీవర్స్ లేక పాత పాఠశాలలోనే పనిచేస్తున్న వారు రిలీవ్ కావాలన్నారు. జాయిన్ అయ్యే కొత్తటీచర్ల సంఖ్య మేరకే రిలీవ్ కావాల్సి ఉంటుందన్నారు.
JGL: వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని భక్తులు దర్శించుకోకుండా నిలిపివేయడంపై కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాన్ని మూసివేయించే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11న ఉపఎన్నిక జరగనుంది. మొత్తం 139 లొకేషన్‌లలో 407 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధిక పోలింగ్ కేంద్రాలు రహమత్ నగర్ డివిజన్ ఉండగా.. అత్యల్పంగా సోమాజిగూడ డివిజన్‌లో ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలోకి 8 పోలీస్ స్టేషన్లు వస్తుండగా.. అత్యధికంగా బోరబండలో 146 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.