NLG: మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం అధికారులు, గ్రామస్థులు మరియు నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: విజయవాడ 61వ డివిజన్ పాయకాపురం YSR పార్క్ దగ్గర బుధవారం ఉదయం టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా శంకుస్థాపన చేశారు. అనంతరం ఉమా మాట్లాడుతూ.. సుమారు రూ.12.35కోట్లతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ కింద టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. స్థానభ్రంశం చెందిన ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఓ నివాసంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 19 మంది చనిపోయారని పాలస్తీనా వైద్య వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగినట్లు కమాల్ అద్వాన్ ఆసుపత్రి పేర్కొంది.
KMM: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద బుధవారం మార్కెట్ నిర్వాహకులు మిర్చికి జెండా పాట నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ నిర్వాహకులు మాట్లాడుతూ… కొత్త తేజ మిర్చి క్వింటా రూ. 16,001, ఏసీ తేజ మిర్చి రూ. 16,700 పలికినట్లు తెలిపారు. అదేవిధంగా మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
NLR: అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో బుధవారం జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు వెల్లడించనున్నట్లు సమాచారం.
BDK: సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును… బీజేపీ మండల అధ్యక్షుడు రాజేష్ నాయక్ వినతిపత్రం సమర్పించారు. గుడి తండాలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏదైనా కారణాలతో ఆగిపోతే పది రోజుల వరకు గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, బోర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ELR: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్సీ మాజీ జెడ్పీ ఛైర్మన్ మేక శేషుబాబు బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.
NLG: నల్గొండ మండల పరిధిలోని చందనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
TG: రాచకొండ సీపీ కార్యాలయానికి మంచు మనోజ్ వెళ్లారు. సీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. జల్‌పల్లి నివాసంలో సీసీటీవీ ఫుటేజీల మాయం, రిపోర్టర్‌పై నిన్న జరిగిన దాడి ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా.. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నిన్న పోలీసులు.. మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రకాశం: నంద్యాల జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి వారు వెలసిన శ్రీశైల క్షేత్రాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం ఉదయం టీడీపీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.
ఖమ్మం: మధిర క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తహశీల్దార్ రాంబాబు అన్నారు. బుధవారం ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలను మండల తహశీల్దార్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మొండితోక లత, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల: సిరిసిల్ల బైపాస్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణానికి చెందిన సురేశ్ బైపాస్ వద్ద మృతి చెందాడు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: బల్లికురవ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల దగ్గర నుంచి మండల రెవెన్యూ అధికారి స్ఫూర్తి అర్జీలను స్వీకరించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై ఆరా తీశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఖమ్మం: ప్రజా సమస్యలపై బయ్యారం మండల సీపీఎం పార్టీ నాయకులు సర్వే నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒకటో వార్డు నుండి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆ పార్టీ నాయకులు మండా రాజన్న తెలిపారు. ఈ సర్వేలో అర్హులైన వారికి ఇండ్ల నిర్మాణం, పింఛన్, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, విద్యుత్తు దీపాల వంటి సమస్యలను గుర్తించామన్నారు.
KRNL: మంత్రాలయం పుణ్యక్షేత్రంలోని శ్రీరాఘవేంద్ర స్వామి ఆలయంలో నాగ సాధువులు ప్రత్యక్షమయ్యారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థం నాగ సాధువులు వచ్చారు. ముందుగా గ్రామదేవత శ్రీమంచాలమ్మ దేవికి కుంకుమార్చనలు నిర్వహించి అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. శ్రీమఠం పీఠాధిపతులు నాగ సాధువులను శాలువాలతో సత్కరించారు.