• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మోహన్ బాబును కఠినంగా శిక్షించాలి’

PLD: మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని చిలకలూరిపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఆస్తి తగాదాల విషయంపై వారి కుమారులు రోడ్డు మీదకి రావడంతో మీడియా వ్యవస్థ చొరబడిందన్నారు. అటువంటి మీడియా పాత్రికేయులపై దాడులు చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు.

December 11, 2024 / 02:21 PM IST

వసతి గృహాలకు మరమ్మత్తులు

PPM: జిల్లాలోని 11 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సుమారు రూ.189 లక్షలతో మరమ్మత్తుల పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం అయన మాట్లాడుతూ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించినట్టు తెలిపారు. 24 -25 ఆర్థిక సంవత్సరంగాను వసతి గృహాల్లో మేజర్ మరమ్మతు పనులకు రూ 150.81లక్షలు, మైనర్ పనులకు 37.60లక్షలు అని తెలిపారు.

December 11, 2024 / 02:21 PM IST

వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి సీతక్క

MLG: ములుగు మండలం జాకారంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన 2024-2025 మనక్ ప్రాజెక్ట్‌లో 7 ప్రదర్శన పోటీలను బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రారంభించారు. సీతక్క వెంట కలెక్టర్ దివాకర టీఎస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

December 11, 2024 / 02:20 PM IST

గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

WNP: జిల్లాలో 8,569 మంది అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షలు రాయనున్నారని, అందుకోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల15,16తేదీలలో నిర్వహించే పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

December 11, 2024 / 02:20 PM IST

గ్రామ పోలీసు అధికారులు అందుబాటులో ఉంటారు: ఎస్సై

NLG: నల్గొండ మండలంలోని గ్రామాలకు గ్రామ పోలీసు అధికారులు అనుక్షణం అందుబాటులో ఉంటారని నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

December 11, 2024 / 02:19 PM IST

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోట్ల

NDL: బేతంచర్ల పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలోని ఎంపీపీ స్కూలును ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి తనిఖీ చేశారు. బుధవారం పాఠశాల తనిఖీలో భాగంగా పాఠశాల రికార్డులను, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పాఠశాల ఆవరణం శుభ్రంగా లేదని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంఈఓ సోమశేఖర్‌కు ఎమ్మెల్యే సూచించారు.

December 11, 2024 / 02:19 PM IST

‘ప్రభుత్వ బ్యాంకులతో సంపన్నులకే మేలు’

ప్రభుత్వ బ్యాంకులతో సంపన్నులకే మేలు జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ప్రైవేటు ఫైనాన్షియర్లలా మారాయని ఆరోపించారు. సామాన్యులకు సేవలందించాల్సిన బ్యాంకులు లాభాపేక్షతో పనిచేస్తున్నాయన్నారు. సిబ్బంది కొరత, పని వాతావరణం కారణంగా బ్యాంకులు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయని చెప్పారు. వారి మోసపూరిత స్నేహితులకు అపరిమిత నిధులిచ్చే సంస్థలుగా బ్యాంకులను చూడటం మోదీ ప్రభుత్వం...

December 11, 2024 / 02:17 PM IST

ఈనెల 13న కలెక్టరేట్ సముదాయంలో జాబ్ మేళా

KMR: జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ నెల 13న నిర్వహించే జాబ్ మేళాను వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్ రావు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ రూం.నెం.121లో ఉదయం 10.30 నుంచి 2 గం.ల వరకు పలు ఉద్యోగాలకు ఓ ప్రైవేట్ కంపెనీ జాబ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి గల యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 11, 2024 / 02:17 PM IST

బొమ్మ వెంకన్న సేవలు మరువలేనివి: చల్ల హరిశంకర్

KNR: మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న జయంతి సందర్భంగా మున్నూరుకాపు వసతి గృహంలో ఆయన విగ్రహానికి తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్నూరుకాపులను ఒక తాటి పైకి తీసుకువచ్చిన ఘనత వెంకన్నకు దక్కుతుందన్నారు. వెంకన్న చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.

December 11, 2024 / 02:12 PM IST

జైలులో ఖైదీకి చిత్రహింసలు

E.G: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓ ఖైదీని  జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. జీవితఖైదు అనుభవిస్తున్న నిందుడితో ఉన్నతాధికారి వ్యక్తిగత పనులు చేయించుకోవడమే కాకుండా దాడి చేయడంతో అతను గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై జైలు అధికారులు స్పందించాల్సి ఉంది.

December 11, 2024 / 02:11 PM IST

చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: మిడుతూరు మండలంలోని కాజీపేట గ్రామానికి చెందిన సీతారామరెడ్డి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆరు లక్షల చెక్కును బుధవారం ఎమ్మెల్యే విజయ సూర్య అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

December 11, 2024 / 02:10 PM IST

13న అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం

AKP: ఈ నెల 13న అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ తెలిపారు. బుధవారం రాంపురం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

December 11, 2024 / 02:10 PM IST

అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోపణలు

అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు. సిరియాలో జరుగుతున్న పరిణామాల వెనుక ఈ రెండు దేశాల ప్లాన్లు ఉన్నాయని, ఆ దేశ అధ్యక్షుడు అసద్‌ పతనం కావడంలో వీటి భాగం కూడా ఉన్నట్లు వెల్లడించారు. సిరియా పొరుగునున్న ఓ దేశం కూడా వీటితో జత కలిసిందని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే సిరియా నేవీని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గత 48 గంటల్లో ఆ దేశంపై 480 దాడులు జరిపింది.

December 11, 2024 / 02:10 PM IST

మధిరలో అస్తవ్యస్తంగా పల్లె దవాఖాన

KMM: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని లడక్ బజార్ వద్ద ఉన్నటువంటి పల్లె దవాఖానకు వెళ్లేదారి పిచ్చి మొక్కలు బాగా పెరిగి అస్తవ్యస్తంగా తయారయిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

December 11, 2024 / 02:09 PM IST

ఓబులదేవరచెరువులో మోహన్ బాబుపై ఫిర్యాదు

ATP: హైదరాబాదులో TV 9, TV 5 మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని ఓబులదేవరచెరువులో జర్నలిస్టులు డిమాండ్ చేశారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో SI మల్లికార్జున్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు విలేకరులకు క్షమాపణ చెప్పాలన్నారు.

December 11, 2024 / 02:08 PM IST