నడకను మీ శరీరానికి ప్రతిరోజూ మీరిచ్చే కానుకగా భావించండి. క్రమం తప్పకుండా రోజూ కనీసం 7 వేల అడుగులు నడవండి. నడకను ఆస్వాదిస్తూ పూర్తి చేయాలి తప్ప భారంగానో, చేయక తప్పని పనిగానో భావించకండి. ఈ అలవాటును కొనసాగించడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. మనసు తేలికపడుతుంది.