TPT: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం కోటక్ మహీంద్ర మైక్రో ఫైనాన్స్ సంస్థలో ‘ట్రైనింగ్ సెంటర్ ఆఫీసర్’ భర్తీకి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శోభన్‌బాబు తెలిపారు. పది నుంచి పీజీ వరకు చదివి వయసు 21-25 సంవత్సరాల వారు అర్హులన్నారు. సమాచారం కోసం 87124 95517లో సంప్రదించాలన్నారు.