NRML: ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్, గంగన్నపేట్ గ్రామాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత తనిఖీ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆమె ఆయా గ్రామాలలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసే రికార్డులను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం తప్పకుండా పెట్టాలని అంగన్వాడీ టీచర్లకు ఆమె సూచించారు.
VZM: ప్రజలు క్షయ వ్యాధిని అంతమొందించాలని కోరపు కొత్తవలస పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పి.స్రవంతి కోరారు. బుధవారం దత్తిరాజేరు మండలంలోని మరడాం గ్రామంలో వందరోజుల టిబి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారందరికీ 24 రకాల పరీక్షలు జరిపారు. ఇందులో హెల్త్ ఎడ్యుకేటర్ డివి గిరిబాబు, ఎంపీహెచ్ ఈవో మురళి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
PPM: గుమ్మలక్ష్మిపురం మండల కేంద్రంలో కురుపాం శాసనసభ్యురాలు తోయిక జగదీశ్వరి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వివిధ గ్రామాల నుంచి కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పలువురిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు.
SRD: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్సీ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు ఆర్. సత్యనారాయణను మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు. సంగారెడ్డిలోని వారి నివాసానికి వెళ్లి సత్యనారాయణ యోగక్షేమాలు, అందిస్తున్న చికిత్స గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
SRD: ఖాజీపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 181లోని ప్రభుత్వ భూమిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ బిక్షపతి ఆదేశాల మేరకు ఆర్ఐ జయప్రకాష్ నారాయణ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించినా, కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
1. శరీరంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.2. కొవ్వు పెరుగుదలను నియంత్రిస్తుంది.3. రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది.4. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.5. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.6. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.7. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
JGL: మెట్‌పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో బుధవారం ముదిరాజ్ సంఘానికి స్టఫ్ నిధుల నుంచి మంజూరైన ప్రొసీడింగ్ పత్రాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అందజేశారు. సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన జువ్వాడికి ముదిరాజ్ సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
KDP: కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన ముక్కా రూపానంద రెడ్డిని TDP రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన రాజు సన్మానించారు. కడపలో బుధవారం జరిగిన రూపానందరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చమర్తి పాల్గొన్నారు. ఆయన వెంట TNSF కార్యదర్శి వేణుగోపాల్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
GNTR: పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు పరిశీలించారు. రోడ్లు, నీటి సదుపాయాలు, విద్యుత్, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని, సంబంధిత శాఖలకు పంపించి త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
PPM: అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌తో కలిసి సదస్సులో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. భవిష్యత్ లక్ష్యాలపై సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు దిశ నిర్దేశం చేశారని మంత్రి తెలిపారు.
ఈ రోజు ఐదు కంపెనీల IPO సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ప్రధాన విభాగంలో విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్.. SME విభాగంలో పర్పుల్ యునైటెడ్ సేల్స్, సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీల సబ్‌స్క్రిప్షన్ మొదలైంది. వీటిలో మొబిక్విక్ పబ్లిక్ ఇష్యూ తొలిగంటలోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. కాగా, 13న ఈ కంపెనీల IPO సబ్‌స్క్రిప్షన్ ముగియనుంది.
BDK: మధిర మండలం మడుపల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం సిఫార్సు మేరకు మంజూరైన సీఎంఆర్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాజారావు, పుల్లయ్య పంపిణీ చేశారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
KMM: నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామంలో బుధవారం రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు శంకుస్థాపన చేశారు. మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్ వెళ్లారు. జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్‌కు రాజస్థాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్‌లు స్వాగతం పలికారు. కాగా సీఎం రాజస్థాన్‌లో వ్యక్తిగత పనులు ముగించుకొని రేపు, ఎల్లుండి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.
ATP: రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని శింగనమల MLA బండారు శ్రావణి తెలిపారు. నార్పల మండలం B.పప్పురు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. సదస్సులో వచ్చిన అర్జీలకు 45 రోజుల్లోపు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కారం చేస్తారని తెలిపారు.