VZM: బొబ్బిలి పట్టణంలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామ సంఘ సభ్యులకు విజన్ బిల్డింగ్ పై బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా DRDA అదనపు పథక సంచాలకులు సావిత్రి మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏ విధంగా అభివృద్ధి చెందాలో అవగాహన కల్పించారు.
జనగామ: జిల్లా కేంద్రంలోని నెహ్రు పార్క్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ అర్బన్ కో-అపరేటివ్ బ్యాంకును బుధవారం ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ కో-అపరేటివ్ బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా నిలువాలని కోరారు.
JGL: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను… ఉపాధ్యాయులు జగిత్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వాతావరణ మార్పుల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ తెలిపారు.
ELR: అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. బుధవారం నిర్వహించిన ఈ సదస్సుకు ఏలూరు జిల్లా నుండి కలెక్టర్ వెట్రి సెల్వీ, పశ్చిమగోదావరి జిల్లా నుండి నాగరాణి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
AP: ఈ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను హెచ్చరించారు. రాష్ట్రాన్ని స్మగ్లింగ్ భూతం పట్టి పీడిస్తుందన్నారు. చివరికి పెట్రోల్ కూడా కల్తీ జరుగుతుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
HYD: నాంపల్లిలో భయానక వాతావరణం నెలకొంది. బుధవారం మధ్యాహ్నం క్రిమినల్ కోర్టుకు వెళ్లే దారిలో ఉన్న HP పెట్రోల్ బంకుకు పెట్రోల్‌తో వ్యాన్ వచ్చింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వ్యాన్ నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని రోడ్డు మీదకు మళ్లించాడు . స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్ష కొండ గ్రామంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఒడ్డెర కుల సంఘ భవనానికి భూమి పూజ చేశారు. సంఘ భవనం నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధుల నుంచి విడుదలైన ప్రోసిడింగ్ పత్రాన్ని అందజేశారు. అనంతరం సంఘ సభ్యులు ఆయనను సన్మానించారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం మండల కార్యకర్తలు ఉన్నారు.
ELR: పోలవరం మండలం చాగొండపల్లిలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి రాంబాబు మొక్కజొన్న పంటల్లో కలుపు యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తే ముందు, పిచికారి సమయంలో పాటించాల్సిన పద్ధతులను వివరించారు. శాస్త్రవేత్త కె.పణి కుమార్ ఫోన్ ద్వారా రైతులకు పలు సూచనలు చేశారు.
జనగామ: జిల్లాలో గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై కలెక్టర్ అవగాహన సదస్సును నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షకు జిల్లాలో 16 కేంద్రాల్లో 5,471 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని అన్నారు.
GDWL: ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గద్వాల జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం అందించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నడిగడ్డ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
RR: కుమ్మరుల అభివృద్ధికి నూతన సంఘం కృషి చేయాలని సంఘం నాయకులు సూచించారు. కడ్తాల్ కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, శివ ప్రధాన కార్యదర్శిగా యాదగిరి, కోశాధికారులుగా ప్రశాంత్, రమేష్‌లను ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని సంఘం నాయకులు సన్మానించి, అభినందించారు.
KDP: చింతకొమ్మదిన్నె మండలం ఏఎల్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటుంన్న యూసఫ్ బాషా అనే వ్యక్తి బుధవారం ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చింతకొమ్మదిన్నె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
NRML: జర్నలిస్టుపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని నిర్మల్ పట్టణంలో జర్నలిస్టులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో రత్నకళ్యాణికి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులు మాట్లాడుతూ.. న్యూస్ కవరేజ్ కొరకు వెళ్లిన ఓ జర్నలిస్టుపై.. మోహన్ బాబు దాడి చేయడానికి ఖండిస్తున్నామని, పోలీసులు వారిని అరెస్టు చేయాలని కోరారు.
MDK: పారదర్శక పాలన అందించాలని నూతన పాలకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్య క్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పారదర్శక పాలనతో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.
PPM: శంబర పోలమాంబ ఉత్సవాలను రాష్ట్రస్థాయి పండుగలా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పార్వతీపురం సబ్ కలెక్టర్ అన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శంబర జాతర ఏర్పాట్లుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మక్కువ మండలంలోని ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన శంబర పోలమాంబ జాతర మహోత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా జరుపనున్నారు.